
అనుమానితులకు పాలిగ్రాఫ్ టెస్ట్
ముద్దనూరు : ఇద్దరూ మంచి స్నేహితులు.. కలిసి భోజనం చేశారు.. మరణంలోనూ వారు స్నేహం వీడలేదు. ముద్దనూరు–కడప ప్రధాన రహదారిలో సున్నపురాళ్లపల్లె క్రాస్ వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ ఢీకొని జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు.. చిలంకూరుకు చెందిన హాజీవలి, సీకే.సుగాలిబిడికి గ్రామంలో నివాసముంటున్న రామ్మోహన్ ఇరువురూ మంచి స్నేహితులు. బుధవారం ఇద్దరూ కలిసి భోజనం చేయాలనుకున్నారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రామ్మోహన్ చిలంకూరు వద్ద లారీ నిలిపి హాజీవలితో కలిసి మోటార్ బైక్‌పై ముద్దనూరులో భోజనం చేయడానికి వెళ్లారు. అనంతరం తిరిగి చిలంకూరుకు బయలుదేరారు. సున్నపురాళ్ళపల్లె క్రాస్ వద్ద వెనుకనుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో హాజీవల్లి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రామ్మోహన్‌ను 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

అనుమానితులకు పాలిగ్రాఫ్ టెస్ట్