
ప్రాణాలతో చెలగాటం!
జంకుతోన్న ఎకై ్సజ్‌శాఖ
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికలకు ముందు నాణ్యమైన మద్యం...సరసమైన ధరల్లోనే ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. విచ్చలవిడి మద్యం షాపులు, వాటికి అనుసంధానంగా బెల్టు షాపులు యథాతథం కాగా...ఇప్పుడు కల్తీ మద్యం దందా నడుస్తోంది. కేవలం స్పిరిట్‌తో తయారీ చేసిన నకిలీ మద్యంతో మందు బాబుల గొంతులు తడుపుతున్నారు. అందుకోసం తిరుపతి, రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారీ కేంద్రాలు కూడా వెలిశాయి. గత జనవరి–ఫిబ్రవరి మాసాల్లో స్పిరిట్‌తో మద్యం తయారీ కేంద్రాలు వెలుగులోకి రాగా, తాజా శుక్రవారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె కేంద్రంగా టీడీపీ ఇన్‌ఛార్జి జయచంద్రారెడ్డి కనుసన్నులల్లోని నకిలీ మద్యం తయారీ కేంద్రం పట్టుబడింది.
● ఇప్పటికే రూ.90 క్వార్టర్ ఇచ్చే మద్యంపై అనేక అనుమానాలుంటే...తాజాగా కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం దందా ప్రారంభమైంది. కేవలం స్పిరిట్‌తో మద్యం తయారు చేస్తూ మందు బాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎన్నికలకు ముందు నాణ్యమైన మద్యం అందిస్తానని ముఖ్య మంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మాట దేవుడెరుగు... ఇప్పుడు కల్తీ మద్యాన్ని అరికట్టలేని పరిస్థితికి కూటమి సర్కార్ వచ్చేసింది. కూటమి నేతల కనుసన్నల్లోనే ఈ వ్యాపారం సాగుతుందనేది బహిరంగ రహస్యంగా ఉండేది. తాజాగా తంబళ్లపల్లె నకిళీ మద్యం తయారీ కేంద్రంతో వ్యవహారం బట్టబయలయ్యింది.
లోతైన విచారణకు పాతర...
కల్తీ మద్యం కోసం తిరుపతి కేంద్రంగా పెద్ద నెట్‌వర్క్ నడుస్తున్నట్లు అప్పట్లో తెరపైకి వచ్చింది. ఈ విషయం ఎకై ్సజ్‌శాఖ అధికారులకు తెలిసినా బడాబాబుల పేర్లు బయటకు రాకుండా అనామకులను కేసులో పెట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వెలుగు చూశాయి. తిరుపతి, రైల్వేకోడూరుతో పాటు రాజంపేటలోనూ ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాలను గుర్తించి దాడులు చేశారు. దీంట్లో ఒకరిద్దరిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఈ రాకెట్ వెనుక ఎవరున్నారు..? కేరళ నుంచి స్పిరిట్ ఎవరు తెప్పిస్తున్నారు..? లేబుళ్లు, స్టిక్లర్లు ఎక్కడ తయారవుతున్నాయనే కోణంలో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. అప్పట్లో లోతైన విచారణకు పాతరేశారు. రాజంపేట తయారీ కేంద్రాన్ని గుర్తించినప్పుడు తమకు కావాల్సిన వారి పేర్లు బయటకు రాకుండా ఉండటం కోసం తిరుపతికి చెందిన ఓ నేత రోజంతా రాజంపేట అధికారుల చుట్టూనే తిరిగినట్లు సమాచారం.
● తంబళ్లపల్లె కేంద్రంగా టీడీపీ నేత జయచంద్రారెడ్డి సన్నిహితులు తయారు చేస్తున్న నకిళీ మద్యం దందా వ్యవహారం పుట్టపర్తి, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. బ్రాండెడ్ లేబు ళ్లు, బాటిళ్లుతో నకిళీ మద్యం తయారీ చేసి మద్యం షాపులకు చేరవేసి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, రామప్రసాద్‌రెడ్డిలతో జయచంద్రారెడ్డికి సన్నిహిత సంబంధాలు కారణంగా కేసు నుంచి తప్పించేందుకు రాజకీయ పైరవీలు ఆరంభమైనట్లు సమాచారం.
వైఎస్సార్ కడప జిల్లాలో అధికారపార్టీ నేతల నోటి దూలకు ఎకై ్సజ్‌శాఖ జంకుతోంది. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో అనధికారిక మద్యం షాపులు వెలిశాయి. ముఖ్యంగా ప్రొద్దుటూరు, కమలాపురం, వీఎన్‌పల్లె, యర్రగుంట్ల బ్రాందీషాపుల నిర్వాహకులతో సంబంధం లేకుండా బంకులు ఏర్పాటు చేసి మద్యం షాపులను కొన సాగిస్తున్నారు. అధికారికంగా నిర్వహిస్తున్న మద్యం షాపుకు చెంతలోనే తెలుగుతమ్ముళ్లు అక్రమంగా మద్యం షాపులను కొనసాగిస్తున్నారు. నియంత్రించే దిశగా ఎకై ్సజ్‌శాఖలో అడుగులు పడడం లేదు. ఓవైపు కల్తీ మద్యం మరోవైపు విచ్చలవిడి బెల్ట్‌షాపులతో తమ్ముళ్లు ఎకై ్సజ్‌శాఖ యంత్రాంగాన్ని ఉక్కిరిబి క్కిరి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
తెలుగుతమ్ముళ్ల నేతృత్వంలో కల్తీ మద్యం నెట్‌వర్క్
అన్నమయ్య జిల్లాలో అత్యధికంగాతెరపైకి వస్తున్న వైనం
నాడు రైల్వేకోడూరు, నేడు తంబళ్లపల్లెలోనకిలీ మద్యం తయారీ కేంద్రాలు
పుట్టపర్తి, కడప, అన్నమయ్య జిల్లాలకు నకిలీ మద్యం సరఫరా