
సాగు ఖర్చు
(ఎకరాకు.. రూ. వేలు)
తలపాగా నెత్తిన చుట్టి..
కాడిని భుజానెత్తి..
రెక్కల్ని ముక్కలుగా చేసి దుక్కి దున్నినా..
ఆశల మోసులు మొలకెత్తలేదు!
పొలం ముంగిటే కాపుకాసినా..
ఒంట్లోని చెమట చుక్కల్ని
నేల చిందించినా..కలల ఫలం దక్కలేదు!
ఆరంభంలో ఊరించిన వాన చినుకులే..
ఆపై ఉసూరుమనిపించి
కంట కునుకే లేకుండా చేశాయి.
ఆఖరి(ఫ్)కి అన్నదాత కంట
కన్నీళ్లే ఒలికించాయి..
అంతో ఇంతో పంట చేతికందే వేళ..
మద్దతు ధర పాతాళానికి పడిపోతే..
సాగు భారం కాక.. హారమవుతుందా!
ఆశల ఉల్లి.. చేలోనే కుళ్లిపోయింది..
అరటికి ధరే లేకుండా పోయింది..చేమంతి చేజారి వాడిపోయింది..
ఆదుకోవాల్సిన పాలకులే
కర్షకుడిపై చిన్నచూపు చూస్తే..
కల్లబొల్లి కబుర్లతోనే కాలం గడిపేస్తే..
అన్నదాత కడుపు కాలదా!
పండించిన పంట నేలపాలవదా!
ఈ ఏడు ఖరీఫ్‌లోనూ రైతన్నకు.. నష్టమే పలకరించింది.. ప్చ్...ఆశల స్థానంలో అప్పే మిగిలింది...
– కడప అగ్రికల్చర్
70- 80
700 - 800
మద్దతు ధర
(రూ.లలో)
కోటి ఆశలతో రైతులు ఖరీఫ్‌లో ఉల్లి పంట సాగు చేశారు. సేద్యాలు, విత్తనాలు, సత్తువులు, ఎరు వులు, పురుగుముందులంటూ వేలకు వేలు ఖర్చుచేశారు. అతివృష్టి..అనావృష్టి కారణంగా అనుకున్న దిగుబడి రాలేదు. ధర చూస్తే పాతాళానికి పడిపోయింది. క్వింటాల్ రూ. 7 వందలకు అమ్మితే సాగు ఖర్చులు కూడా రాని పరిస్థితి. కూ టమి ప్రభుత్వానికేమో రైతంటేనే గిట్టదు..మద్దతు ధర పెంచమంటే పెంచదు. ఉల్లి రైతులు ఈ ఏడాది నష్టాలను మూటగట్టుకున్నారు.
16,600
సాగైన పంట..
(ఎకరాల్లో)
50 - 70
దిగుబడి
(క్వింటాల్)
45 - 50
నష్టం..
(ఎకరాకు.. రూ. వేలల్లో)

సాగు ఖర్చు