
ఆర్టీపీపీలో ఉద్రిక్తత
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో సోమవారం ఏపీఎస్సీ జేఏసీ, టీఎన్‌వీకేఎస్, బీఎంఎస్ యూనియన్ల మధ్య తోపులాట జరిగింది. కొంచెం సేపు ఉద్రిక్త చోటు చేసుకుంది. పోలీస్, విజిలెన్స్, ఎస్‌పీఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇరువురు వర్గాల వారితో మాట్లాడి సర్దిచెప్పారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ నిరసనలు, రిలే దీక్షలు చేసి సోమవారం ఫౌంటెయిన్ వద్ద నుంచి ర్యాలీ చేపట్టింది. అదే సమయంలో ప్రభుత్వంలో భాగమైన టీఎన్‌వీకేఎస్, బీఎంఎస్ యూనియన్లు కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికుల కోసం నిరసనలు చేపట్టి సోమవారం రిలే దీక్షలు ప్రారంభించి గేటు బయట ఽఆందోళన చేసింది. జేఏసీ ర్యాలీ అనంతరం ఉద్యోగ, కార్మికులు విధులకు వెళ్తుండుగా, గేటు బయట టీఎన్‌వీకేఎస్, బీఎంఎస్ యూనియన్లు విధులకు పోకుండా అడ్డుకుంది. దీంతో ఒక్కసారిగా జేఏసీ, ఆ రెండు యూనియన్ల మధ్య తొపులాట జరిగింది. ఈ తోపులాటలో జేఏసీకి చెందిన ఓ ఉద్యోగి చొక్కా చినిగింది. అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పారు. అయినా జేఏసీ నేతలందరూ సంయమనం పాటించి ఎవరు చేసినా ఉద్యోగ కార్మిక సమక్షం కోసమే..ఎవరూ వ్యక్తిగత వాదనలకు పోకూడదని మైకులో చెప్పారు. అనంతరం జేఏసీ నాయకులు ఆర్టీపీపీ సీఈ ని కలిసి వినతి పత్రం అందించారు.
గ్యాస్ బిల్లుల స్కాంపై విచారణ జరిపించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లా వ్యాప్తంగా కేజీబీవీలలో జరిగే గ్యాస్ బిల్లుల స్కాంపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఏ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రాయచోటిలోని కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్స్‌రాజేంద్రన్‌కు ఏఐఎస్‌ఏ నాయకులు వినతిపత్రం సమర్పించారు.