
కాశినాయనవాసికి అరుదైన గుర్తింపు
కాశినాయన : అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన ప్రతిభావంతులైన టాప్ 2025 శాస్త్రవేత్తల జాబితాలో వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన కడియాల చంద్రబాబునాయుడు వరుసగా 6 సారి చోటు దక్కించుకున్నారు. వ్యవసాయకుటుంబంలో పుట్టిన ఈయన బెంగళూరు గీతండీమ్డ్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర అసోసియేటెడ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పలు పరిశోధనరంగాల్లో వివిధ శాస్త్రవేత్తలు ప్రచురించిన పరిశోధనా పత్రాలను ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగి వారి పరిశోధన పత్రాలను అనుసరిస్తూ సూచికలు వాడటం వల్ల ఈ గుర్తింపును పొందారు.