
పొలం యజమానిపై హత్యాయత్నం
మైదుకూరు : గొర్రెలు మేపుకునే విషయంలో తగాదా ఏర్పడి మండలంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ఆవుల గురవయ్య పై అదే గ్రామానికి చెందిన ఆదినారాయణ హత్యాయత్నం చేసినట్టు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. జీవి సత్రంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ఆవుల గురవయ్యకు చెందిన బెండ తోటలో శనివారం ఆదినారాయణకు చెందిన గొర్రెలు మేస్తుండగా అడ్డుకోవడంతో వారి మధ్య గొడవ ఏర్పడినట్లు సిఐ పేర్కొన్నారు. ఆ మేరకు ఆదినారాయణ మచ్చు కత్తితో గురవయ్య పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. సంఘటనకు సంబంధించి ఆదినారాయణపై సోమవారం హత్యాయ త్నం కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
వాహనదారులకు
నాణ్యమైన సేవలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లాలోని వాహన యజమానులకు, డ్రైవింగ్ లైసెన్స్‌దారులకు నాణ్యమైన సేవలు అందిస్తామని జిల్లా ఇన్‌చార్జి ఉప రవాణా కమిషనర్ ఎం వీర్రాజు తెలిపారు. సోమవారం జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయానికి సంబంధించి వాహన్ పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి క్లియర్ చేస్తామన్నారు. ఈకైవెసీ కోసం చేసుకున్న దరఖాస్తులు 375 పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వాహన యాజమానులు తమ పనులకు సంబంధించి వాహన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పనులు పూర్తి కావట్లేదని భావించిన వారు బుధ, గురు వారాలలో ఉదయం 10 నుండి 1 గంట వరకు తనను నేరుగా కలవచ్చని తెలిపారు.
విద్యుత్‌షాక్‌తో లైన్‌మెన్‌కు తీవ్ర గాయాలు
బద్వేలు అర్బన్ : పట్టణంలోని మైదుకూరు రోడ్డులో గల మోర్ సూపర్ మార్కెట్ వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు సోమవారం మరమ్మత్తులు చేస్తూ ఓ లైన్‌మెన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. పట్టణంలోని మైదుకూరు రోడ్డులో నివసిస్తున్న కె.నాగసుబ్బారెడ్డి 17 ఏళ్లుగా విద్యుత్‌శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మోర్ సూపర్‌మార్కెట్ వద్ద ఉన్న ట్రాన్స్‌పార్మర్ మరమ్మత్తులకు గురైందన్న ఫిర్యాదు అందుకున్న ఆయన పరిశీలించేందుకు వెళ్లాడు. ఎల్‌సీ తీసుకుని మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆయనతో పాటు ఉన్న జూనియర్ లైన్‌మెన్లు హుటాహుటిన ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు.
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
కడప కోటిరెడ్డి సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రైతులకు వ్యవసాయ పనిముట్లకు రుణాలను ఇస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాజంపేట రీజినల్ మేనేర్ సుశాంత్ కుమార్ స్వరూప్, కడప ఆర్‌ఎం శ్రీనివాస ప్రసాద్, ఎల్‌డీఎం జనార్ధనం తెలిపారు. సోమవారం కడపలోని జాన్‌డీర్‌లో నర్సిరెడ్డి, శివకుమార్‌లకు నూర్పిడి యంత్రాలను అందజేశారు. డీఆర్డీఏ డీపీఎం రఘునాథరెడ్డి, బ్రాంచ్ మేనేజర్లు సురేష్‌కుమార్, ఎం.కళ్యాణి, రాజంపేట ప్రాంతీయ కార్యాలయ సీపీసీ మనోజ్‌కుమార్, వెంకటసాయి ఎంటర్‌ప్రైజస్ సంస్థ ఎండీ వెంకట్, జాన్‌డీర్ సేల్స్ మేనేజర్ దుర్గా మునికుమార్ పాల్గొన్నారు.

పొలం యజమానిపై హత్యాయత్నం