
పరిశుభ్రతే ప్రగతికి సోపానం
కడప కోటిరెడ్డిసర్కిల్ : పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యంగా జీవించవచ్చని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అన్నారు. స్వర్ణాంధ్ర– స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ స్టేడియం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మొక్క నాటారు. అనంతరం తమ వంతు కృషి చేస్తామని పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ మొక్కలు భూమిపై కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు. మొక్కలతో ఆహ్లాద వాతావరణం ఉంటే ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో, సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చని తెలిపారు. సమాజ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ(ఏఆర్) బి.రమణయ్య, డీఎస్పీ ఎన్.సుధాకర్, ఎ.శివరాముడు, శ్రీశైలరెడ్డి, టైటస్, సోమశేఖర్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీపీపీలో యూనియన్ల మధ్య ఘర్షణ
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో యూనియన్ల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుంది. టీఎన్‌టీయూసీ యూనియన్‌కు చెందిన మనోహర్, పులి సుధాకర్‌రెడ్డిలకు స్వల్పంగా గాయలయ్యాయి. యూనియన్ నాయకులు కలమల్ల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయగా పోలీసులు సర్ది చెప్పాల్సి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధన కోసం 23 యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడిడి ఈ నెల 15వ తేదీ నుంచి నిరసన చేపట్టారు. ప్రభుత్వంలో భాగమైన టీఎన్‌టీయూసీ, బీఎంఎస్ యూనియన్లు కాంట్రాక్టు కార్మికుల కోసం వేరుగా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. శనివారం జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహర దీక్షలు ప్రారంభం కాగా, అదే సమయంలో గేటు బయట టీఎన్‌టీయూసీ, బీఎంఎస్ యూనియన్లు నిరసన చేపట్టాయి. విధులకు వెళ్తున్న ఉద్యోగ, కార్మికులను రెండు యూనియన్ల నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుని తోపులాట జరిగింది. టీఎన్‌టీయూసీ యూనియన్‌కు చెందిన మనోహర్, పులి సుధాకర్‌రెడ్డిలకు గాయాలయ్యాయి. దీంతో యూనియన్ నేతలు కలమల్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ అంతా కలిసి చర్చించుకుని సర్దుబాటు అయ్యారు. జేఏసీ నేతలు క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్

పరిశుభ్రతే ప్రగతికి సోపానం

పరిశుభ్రతే ప్రగతికి సోపానం