
విద్యుత్ లైన్‌మెన్ సస్పెన్షన్
కడప కార్పొరేషన్: కడప డివిజన్ పరిధిలోని వెస్ట్ సెక్షన్ రామరాజుపల్లె 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న బి. నూతన్ ప్రసాద్ బాబును సస్పెండ్ చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేశామని పేర్కొన్నారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని గవర్నమెంట్, మున్సిపల్, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవును ప్రకటిస్తున్నట్లు డీఈఓ షంషుద్దీన్ తెలిపా రు. సెలవు రోజుల్లో ఎటువంటి ప్రైవేటు క్లాసులుకానీ, తరగతులుగానీ నిర్వహించ కూడదని తెలిపారు. సంబంధిత ఉత్తర్వులు ఉల్లంఘించిన యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.
కడప ఎడ్యుకేషన్: ప్రొద్దుటూరులోని వైవీయూ వైఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఫస్ట్, సెకండ్, థర్డ్ బీటెక్ కోర్సులకు సంబంధించి సెమిస్టర్ ఫలితాలను శనివారం వైవీయూలో వీసీ అల్లం శ్రీనివాసరావు తన చాంబర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ ఏడాది మే నెలలో బి.టెక్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఫలితాలను విశ్వవిద్యాలయ వైబ్సెట్ https:www.yvuexams.in /results.aspx సందర్శించి తెలుసుకోవచ్చన్నారు.పరీక్షల విభాగాన్ని, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వీసీ ప్రశంసించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ పి.పద్మ, ప్రొద్దుటూరు వైఎస్‌ఆర్. వైవీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. జయరామి రెడ్డి, ఇంజినీరింగ్ ఫ్యా కల్టీ. డీన్, ప్రొఫెసర్ జి. జయ చంద్ర రెడ్డి , వైవియు పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.