
ఆరోగ్య జిల్లా అందరి బాధ్యత
కడప సెవెన్‌రోడ్స్: స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా వైఎస్‌ఆర్ కడప జిల్లాను కాలుష్య రహిత ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ‘స్వచ్ఛ దివస్‘ కార్యక్రమాన్ని పురస్కరించుకునిఅధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం చేపడుతున్న స్వచ్ఛ దివస్ కార్యక్రమంతో స్వచ్ఛత వైపు అడుగులు వేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్ని బ్లాకుల వద్ద ఆయా శాఖల అధికారులు, సిబ్బంది స్వచ్ఛ దివస్ నిర్వహించారు. డీఆర్వో , ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి