
అన్ని ఇబ్బందులు తీరాయి
ప్రధానంగా ఈ వంక ప్రవాహం వల్ల వర్షాకాలంలో మా ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గ్రామం విడిచి ఎక్కడికి వెళ్లాలన్నా దిక్కుతోచని పరిస్థితి. వంక ప్రవాహం తగ్గినంత వరకు ఎక్కడికి వెళ్లేందుకు వీలుండేది కాదు. ప్రస్తుతం వంతెన నిర్మాణం పూర్తి కావడంతో అన్ని ఇబ్బందులు తొలగిపోయాయి.
– నీలం శివగంగరాజు, ఓబుల్‌రెడ్డిపల్లె
వంతెన నిర్మాణం చేపట్టకముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారం. రాకపోకలకు తీవ్ర సమస్యగా ఉండేది. ముఖ్యంగా విద్యార్థులకు వీఎన్ పల్లె, వేంపల్లె పాఠశాలల్లో చదువుకునే వారికి ఆటంకం కలిగేది. ఈ వంతెన నిర్మాణం వల్ల మృతదేహాలకు అంత్యక్రియలు, విద్యార్థుల చదువులకు, రాకపోకలకు ఆటంకం లేకుండా జరిగిపోతున్నాయి.
– కొండెబోయిన గంగన్న, ఓబుల్‌రెడ్డిపల్లె
వందల సంవత్సరాలుగా ఉన్న మొగమూరు వంక ప్రవాహంతో ఎంతో ఇబ్బందులు పడేవారం. నేను ఇబ్బంది పడినప్పటికీ మా గ్రామానికి స్వేచ్ఛగా రాకపోకలు కొనసాగించేందుకు వంతెన నిర్మాణం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వంతెన నిర్మాణానికి రూ. 57 లక్షలు మంజూరు కాగా, వంతెన నిర్మాణం కూడా పూర్తయి రాకపోకలు సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ రావడంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బిల్లుల మంజూరుకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించేందుకు సవాలక్ష కారణాలు చెబుతూ కాలాయాపన చేస్తూ రావడంతో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. – బత్తల వీరయ్య యాదవ్,
మాజీ ఎంపీపీ, ఓబుల్‌రెడ్డిపల్లె

అన్ని ఇబ్బందులు తీరాయి

అన్ని ఇబ్బందులు తీరాయి