
మెడికల్ సీట్లను వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వం
పులివెందుల : పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరైతే.. వద్దని వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వమిదని కూటమిపై వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం పులివెందులలోని మెడికల్ కళాశాలను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలో పూర్తయిన నిర్మాణాలు, ఆసుపత్రి భవనాలు, నర్సింగ్ కళాశాలను పరిశీలిస్తూ.. పూర్తయిన భవనాలను మీడియా ప్రతినిధులకు చూపించారు. అనంతరం వారు మెడికల్ కళాశాల ఎదురుగా.. కళ్లు ఉండి చూడలేని సీఎం చంద్రబాబు డౌన్ డౌన్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, రైతు విభాగపు నాయకులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పులి సునీల్‌కుమార్, వేముల సాంబశివారెడ్డి, సర్వోత్తమరెడ్డి, రసూల్, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా, పులివెందుల నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పూర్తి కాకపోతే.. సీట్లు ఎలా కేటాయిస్తారు?
పులివెందుల మెడికల్ కళాశాలకు సీట్లు కేటాయిస్తే.. కూటమి వద్దని వెనక్కి పంపింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవస్థ వచ్చి చూసి 50 సీట్లు కేటాయించిందంటే.. మెడికల్ కళాశాల పూర్తయినట్లా, పూర్తి కానట్లా? మెడికల్ కళాశాల పూర్తి కాకపోతే ఈ కళాశాలకు 50 సీట్లు ఎందుకు కేటాయిస్తారు. కోట్లు వెచ్చించి నిర్మిస్తే అందుబాటులోకి తెచ్చి మెరుగైన విద్య, వైద్యం అందిచ్చాల్సింది పోయి ప్రైవేట్ పరం చేయడం ఏమిటి?
– రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు
విష ప్రచారం
2024 మార్చిలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభించారు. కాలేజీ, హాస్పిటళ్లకు కావాల్సిన ఎక్విప్‌మెంట్ మొత్తం వైఎస్సార్‌సీపీ పాలనలోనే వచ్చేసింది. రోజుకు ఓపీ 500 నుంచి 1000 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. టీడీపీ ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్సీని పంపించి పులిందుల మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని విష ప్రచారం చేయిస్తోంది. ప్రజలను మభ్యపెట్టాలని చూడటం తగదు.
– ఎస్‌బీ అంజద్ బాషా, మాజీ డిప్యూటీ సీఎం
జగన్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే..
సామాన్య ప్రజలకు విద్య, వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. వాటిని ప్రారంభిస్తే వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ప్రజలతో కలిసి అలుపెరని పోరాటాలు చేసి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. త్వరలో కూటమికి బుద్ధి చెబుతారు.
– రఘురామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మైదుకూరు
పులివెందుల మెడికల్ కళాశాల
90 శాతం పూర్తి
కేవలం రూ.120 కోట్ల మేర పనులు
పెండింగ్
ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైన కూటమి
అలుపెరగని పోరాటాలతో అడ్డుకుంటాం
వైఎస్సార్‌సీపీ నాయకులు

మెడికల్ సీట్లను వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వం

మెడికల్ సీట్లను వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వం

మెడికల్ సీట్లను వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వం

మెడికల్ సీట్లను వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వం

మెడికల్ సీట్లను వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వం