
గేట్, ఇంజినీరింగ్ సర్వీస్ పరీక్షలపై అవగాహన సదస్సు
వేంపల్లె : ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు అత్యంత ప్రసిద్ధి చెందిన పరీక్షలలో గేట్, ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) పరీక్షలు ఎంతో ముఖ్యమైనవని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఏవీఎస్ కుమార్ స్వామి గుప్తా పేర్కొన్నారు. మంగళవారం ట్రిపుల్ ఐటీ ఉన్నత విద్య, పోటీ పరీక్షల విభాగపు అధికారి డాక్టర్ డి.కోనప్ప ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–6 సహకారంతో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఎస్ ఇంజినీరింగ్ అకాడమీ వారిచే విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కెరీర్ లక్ష్యాల పైనే దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు ముఖ్య వక్తగా వచ్చిన ఎస్.ఇంజినీరింగ్ అకాడమీ విద్యావేత్త మణిమోహన్ త్రినాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు గేట్ పరీక్ష, ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్షలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన పరీక్షలు రాసే విద్యార్థులకు సిలబస్ నిర్మాణం, ప్రశ్నపత్ర విధానం, తయారీ వ్యూహాలు, మాక్ పరీక్షల ప్రాముఖ్యత, స్థిరమైన అభ్యాసం, సమయపాలన, చిట్కాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ రమేష్ కై లాస్, పరిపాలన అధికారి రవికుమార్, ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.