
లక్ష్యం వైపు వసూళ్లు
జిల్లాలో
చెక్‌పోస్టులు: 21
కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా మార్కెట్ కమిటీలు సెస్సు వసూళ్లలో మెరుగ్గా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న పది మార్కెట్ కమిటీలకు సంబంధించి 2025–26 ఏడాదికి మార్కెట్ సెస్సు వసూళ్లు రూ.13.53 కోట్లు లక్ష్యంగా నిర్దేశించింది. జూన్ చివరి నాటికి రూ. 2.98 కోట్లు వసూలైంది. జిల్లాలో పది మార్కెట్ కమిటీల్లో కొన్ని వసూళ్లలో దూసుకుపోతుండగా.. మరికొన్ని వెనుకబడి ఉన్నాయి.
నాలుగు ఏఎంసీలు వసూళ్లలో
మైనస్‌లో ఉంది...
జిల్లాలోని పది అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీలు)లు ఉన్నాయి. ఇందులో ప్రొద్దుటూరు, బద్వేల్, కమలాపురం, సిద్దవటం ఏఎంసీలు వసూళ్లలో గతేడాది కంటే తక్కువగా వసూలైంది. మిగతా కడప, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, ఎర్రగుంట్ల, సింహాద్రిపరం ఏఎంసీల వసూళ్లు గతేడాదికంటే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో భాగంగా కడప మార్కెట్ కమిటి లక్ష్యం ఈ ఏడాది రూ. 205 లక్షలకుగాను ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల కలిపి జూన్ చివరి నాటికి రూ. 69.12 లక్షలు వసూలైంది. అలాగే బద్వేల్ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 205 లక్షలు కాగా జూన్ చివరి నాటికి రూ.54.51 లక్షలు, ప్రొద్దటూరు మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.199 కాగా జూన్ చివరినాటికి రూ. 21.53 లక్షలు, పులివెందుల మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.108 లక్షలు కాగా జూన్ చివరి నాటికి రూ. 29.91 లక్షలు, మైదుకూరు మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 280 లక్షలుకాగా జూన్ చివరి నాటికి రూ. 73.84 లక్షలు, సిద్దవటం మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 28 లక్షలుకాగా జూన్ చివరి నాటికి రూ. 4.18 లక్షలు, ఎర్రగుంట్ల మార్కెట్ కమిటి లక్ష్యం రూ. 86 లక్షలుకాగా ఈ ఏడాది జూన్ చివరి నాటికి రూ. 15.28 లక్షలు, సింహాద్రిపురం మార్కెట్ కమిటి లక్ష్యం రూ. 24 లక్షలు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.5.24 లక్షలు వసూలు అయ్యింది.
● కడప మార్కెట్‌కమిటీలో పసుపు, వేరుశనిగ సంబంధించిన క్రయవిక్రయాలు జరగ్గా.. మిగతా మార్కెట్ కమిటీల్లో పండ్లు ఇతర ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతాయి.
జిల్లాలో 21 చెక్ పోస్టులు....
జిల్లాలో పది మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 21 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇందులో కడప మార్కెట్ కమిటీలో పసుపు, వేరుశనగ వంటివి క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అందుకే కడప మార్కెట్ కమిటి నుంచే ఎక్కువగా సెస్ వసూలు అవుతుంది.
గతేడాది కంటే పెరిగిన మార్కెట్ కమిటీల సెస్సు
2025–26 ఏడాది లక్ష్యం రూ. 13.53 కోట్లు
ఈ ఏడాది మూడు నెలలకు 2.98 కోట్లు వసూళ్లు
లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు
జిల్లాలో 2024–25 ఏడాదికి 10 మార్కెట్ కమిటీల పరిధిలో 21 చెక్ పోస్టులు ఉన్నాయి. అయా చెక్ పోస్టుల ద్వారా వార్షిక ఆదాయం ఏడాదికి రూ. 13.53 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిసి రూ. 298.16 లక్షల సెస్సు వసూలు చేశాము. ఆగస్టు నుంచి సీజన్ ప్రారంభమౌతుంది. అప్పుడు వసూళ్లు బాగా పెరుగుతాయి. – ఆజాద్ వల్లి,
మార్కెటింగ్‌శాఖ ఇన్‌చార్జు ఏడీ

లక్ష్యం వైపు వసూళ్లు

లక్ష్యం వైపు వసూళ్లు

లక్ష్యం వైపు వసూళ్లు

లక్ష్యం వైపు వసూళ్లు

లక్ష్యం వైపు వసూళ్లు