
ప్రభుత్వ పాఠశాల పరిశీలన
ఉన్నత చదువులకు
ఓపెన్ స్కూల్ వరం
పోరుమామిళ్ల: మధ్యలో చదువు మానేసినవారు, 14 సంవత్సరాలు పైబడినవారు ఓపెన్‌స్కూల్ ద్వారా పదవ తరగతి చదివి విద్యాభ్యాసం కొనసాగించవచ్చ ని జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ తెలిపారు. బుధవారం పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఓపెన్‌స్కూల్ వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ సాంబశివారెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామిరెడ్డి, సర్వశిక్షా అభియాన్ ఏఎంఓ విజయభాస్కర్, పోరుమామిళ్ల, కలసపాడు మండలాల ఎంఈఓలు వెంకటయ్య, మస్తాన్‌వలి, తదితరులు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు కల్చరల్: మండలంలోని సీతంపల్లెలో శిథిలావస్థకు చేరిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను డీఈఓ షంషుద్దీన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని సూచించారు. దీంతో వారు మాట్లాడుతూ పాఠశాల శిథిలావస్థకు చేరిందని, విద్యార్థులకు సరైన వసతులు లేవని, ఇందువల్ల తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించామని వివరించారు. పాఠశాలకు నూతన భవనం ఏర్పాటు చేయిస్తానని, విద్యార్థులను పాఠశాలకు పంపాలని డీఈఓ కోరగా.. పంపిస్తామని సమాధానమిచ్చారు. ఎంఈఓ సావిత్రమ్మ, ఉపాధ్యాయుడు డీవీ రమణారెడ్డి, సీఆర్పీ భాస్కర్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.