
జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ముద్దనూరులో 26.4 మి.మీ వర్షపా తం నమోదైయింది. కొండాపురంలో 15.2, కమలాపురంలో 12.4, సింహాద్రిపురంలో 10.6, తొండూరులో 3.2, లింగాల, సీకేదిన్నె 2.2, బి.మఠం, పులివెందులలో 1 మి.మీ వర్షం కురిసింది.
షోలాపూర్–తిరుపతి రైలు ధర్మవరం వరకు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి–షోలాపూర్–తిరుపతి (01437/01438) రైలును ధర్మవరం వరకు పొడిగించారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈ రైలును సెప్టెంబరు 27 వరకు రానుపోను 20 ట్రిప్పు లు నడపనున్నారని తెలిపారు. ఈ రైలు గురు వారం రాత్రి 11.20 గంటలకు షోలాపూర్‌లో బయలుదేరి కురుద్వాడి, బార్సి టౌన్, లాతూర్, లాతూర్‌రోడ్డు, బీదర్, కలబురిగి, వాడి, యాదగిరి, క్రిష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్లమీదుగా మరుసటిరోజు కడపకు రాత్రి 7.53 గంటలకు చేరుకుంటుందన్నారు. ఇక్కడినుంచి రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి, పాకాల, పీలేరు, కలికిరి, మదనపల్లెరోడ్డు, ములకలచెరువు, కదిరి మీదుగా ధర్మవరం శనివారం ఉదయం 3.30 గంటలకు చేరుకుంటుందన్నారు. అదేరోజు ఉదయం 5.30 గంటలకు ధర్మవరంలో బయలుదేరి ఇదే మార్గంలో మధ్యాహ్నం 1.30 గంటలకు కడపకు చేరుకుని ఆదివారం ఉదయం 10.45 గంటలకు షోలాపూర్ చేరుతుందని ఆయన వివరించారు.
ఎరువుల కొరత సృష్టిస్తే లైసెన్స్ రద్దు
ప్రొద్దుటూరు రూరల్: ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తే ఎరువుల దుకాణాల లైసెన్స్‌ను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రానాయక్ హెచ్చరించారు. స్థానిక మైదుకూరు రోడ్డులోని మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ ఎరువుల దుకాణాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని ఎరువుల నిల్వలను, రికార్డులను పరిశీలించారు. నిల్వలలో తేడా వస్తే సరుకులను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. కొను గోలు బిల్లులను కచ్చితంగా ఇవ్వాలని తెలిపా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా లో ఎక్కడా ఎరువుల కొరత లేదన్నారు. ఖరీఫ్ సీజన్‌కు గాను 70వేల మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు మంజూరయ్యాయన్నారు. ఈ సీజన్‌లో మూడు దశల వారీగా ఎరువుల సరఫరా జరుగుతుందన్నారు. తొలి దశలో 25వేల మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయన్నారు. ఏడీఏలు అనిత, అశోక్, ఏఓ వరహరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
గండిలో హుండీల
ఆదాయం లెక్కింపు
చక్రాయపేట: గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో ఉన్న హుండీల ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ సహాయకమిషనర్ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఏడు శాశ్వత హుండీల ద్వారా ఆలయానికి రూ.6,55,549లు, అన్నదానం హుండీ ద్వారా రూ. 7,453లు వెరసి మొత్తం రూ.6,63,002లు వచ్చిందన్నారు. దీంతో పాటు కొన్ని గ్రాముల మిక్స్‌డ్ బంగారు, వెండి వస్తువులు వచ్చినట్లు తెలిపారు. అలాగే 11 కువైట్ దినార్‌లు కూడా వచ్చినట్లు చెప్పారు. కడప దేవదాయ శాఖ సహాయ కమీషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆద్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన,ఉప ప్రధాన,అర్చకులు కేసరి,రాజారమేష్,చక్రాయపేట ఏపీజీబీ అధికారులు, ఆలయ సిబ్బంది, సేవకులు పాల్గొన్నారు.
టోల్‌గేట్ టెండరు ద్వారా..
గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో యేడాది కాలం పాటు టోల్‌గేటు వసూలు హక్కు కల్పించుటకు నిర్వహించిన టెండరు ద్వారా ఆలయానికి రూ.16,10,000లు ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. అశోక్‌రెడ్డి అనే వ్యక్తి ఈ టెండర్ దక్కించు కున్నట్లు ఆయన తెలిపారు.

జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు