ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైంది. ఈనెల 25 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుండడంతో వివాహాలు, శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. సనాతన ధర్మంలో వివాహం ప్రధానమైనది. వీటిని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తే ఆ జంటకు మంగళం జరుగుతుంది. ప్రస్తుతం ఆడంబరాలకు ప్రాధాన్యత పెరిగి ఆచార వ్యవహారాలు తక్కువైపోతున్నాయి. ముందురోజు రాత్రే రిసెప్షన్ ఏర్పా టు వల్ల ముహూర్తానికి హాజరయ్యే వారి సంఖ్య బాగా తగ్గిపోవడం ఆందోళన కలిగించే పరిణామం. ఆర్థిక స్తోమత లేని పేద వారికి వివాహ క్రతువును మేము ఉచితంగా నిర్వహిస్తున్నాం.
– కె.విజయ్‌భట్టర్, అధ్యక్షుడు,
జిల్లా అర్చక పురోహిత సమాఖ్య, కడప