
హంసఫర్‌కు కడపలో స్టాపింగ్ ఇవ్వండి
పులివెందుల : చైన్నె – అహ్మదాబాద్ మధ్య నడిచే హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌కు కడపలో స్టాపింగ్ ఇవ్వాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను బుధవారం ఢిల్లీలో కలిసి వినతిపత్రమిచ్చారు. దీంతో పాటు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కడపలోని రాయచోటి రోడ్డులో ఊటుకూరు, ప్రకృతి నగర్ తదితర ప్రాంతాల వాసుల రాకపోకలకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. ప్రస్తుతం తిరుపతి – షిరిడీ మధ్య వారానికి ఒక రోజు మాత్రమే రైలు నడుస్తోందని, అది కూడా మల్టీ చేంజ్ రూట్లుగా వెళ్లడంవల్ల ప్రయాణ సమయం ఎక్కువవుతోందన్నారు. తిరుపతి నుంచి షిర్డీకి నేరుగా ఒక రైలు ను ప్రతిరోజు నడపాలని, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రికి విన్నవించారు.