
ఆదాయపు పన్నుతోనే దేశాభివృద్ధి
కడప ఎడ్యుకేషన్: ఆదాయపు పన్నుతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆదాయపు పన్నుశాఖ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. కడప నగర శివార్లలోని స్పిరిట్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం ఆదాయపన్నుశాఖ అధికారులు ఇన్‌కామ్ టాక్స్‌డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఆదాయపన్ను కట్టి మన దేశాభివృద్ధికి పాటు పడాలన్నారు. ఆదాయపన్ను శాఖ–2 రఘరామయ్య ఆదాయపు పన్ను లక్ష్యాలను వివరించి విద్యార్థులకు ఆదాయపు పన్ను గురించి ఒక లఘ చిత్రన్ని ప్రదర్శించి ప్రశ్నలు అడిగి వారి ద్వారా సమాధానాలను రాబట్టారు. బాగా సమాధానాలు చెప్పిన ముగ్గురు విద్యార్థులకు ప్రశంసపత్రాలను అందచేసి అభినందించారు. కళాశాల డైరెక్టర్ రవీంద్ర, విద్యార్థులు, అద్యాపకులు, ఆదాయపు పన్నుశాఖ సిబ్బంది పాల్గొన్నారు.