
వంచన, మోసం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి
వీరపునాయునిపల్లె: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మోసం చేయడం, వంచనకు గురిచేయడం రెండూ వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని అనిమెలలో చంద్రబాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి గతంలో జగన్‌మోహన్ రెడ్డి అందించిన పాలనకు ప్రస్తుతం చంద్రబాబు అందిస్తున్న అరాచక పాలనకు ఉన్న తేడాను వారికి వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అందించాడని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అర్హత ఉన్నవారికి కూడా సంక్షేమ ఫథకాలు రద్దు చేసిన విషయాన్ని వారికి తెలియజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాతూ ఎన్నికలకు ముందు బాబు హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి రాగానే హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడన్నారు. ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త సైనికుడిలా పని చేసి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. మండల కన్వీనర్ రఘునాథ రెడ్డి, మైనింగ్ మాజీ డైరెక్టర్ వీరప్రతాప్‌రెడ్డి, అనిమెల సర్పంచు నరేష్‌రెడ్డి, ఎంపీటీసి రాఘవ యాదవ్, సంగమేశ్వర దేవస్థానం మాజీ చైర్మెన్ శివాంజనేయరెడ్డి, రైతు నాయకుడు భాస్కర్‌రెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవి, శ్రీనివాసుల్‌రెడ్డి, శంబురెడ్డి పాల్గొన్నారు.