
అమరావతి అవినీతిపై
విచారణ చేయించాలి
– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి
వైఎస్సార్‌సీపీ నాయకుల లేఖ
కడప కార్పొరేషన్ : అమరావతి రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ నగర ప్రధాన కార్యదర్శి పి. సంపత్ కుమార్, చైతల్య కోరారు. మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వారు లేఖ రాసి రిజిస్టర్ పోస్ట్ చేశారు. అమరావతిలో జరుగుతున్న అవినీతిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పొత్తులో ఉన్నందున వారు విచారణ చేసే అవకాశం లేదన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శివప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ గోపాలక్రిష్ణ పాల్గొన్నారు.