
ధైర్యంగా ఉండండి.. పార్టీ అండగా ఉంటుంది
సాక్షి, రాయచోటి: అధికార పార్టీ పెట్టే అక్రమ కేసులు, దౌర్జన్యాలకు భయపడవద్దని.. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అందుకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం మదనపల్లె పోలీసుస్టేషన్‌లో ఉన్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరం తోడుగా ఉంటామని పేర్కొన్నారు. ప్రతి దానికి చెల్లింపులుంటాయని, ఽధైర్యంగా ముందుకు సాగాలని వైఎస్ జగన్ సూచించారు.
● రమేష్‌కుమార్‌రెడ్డి సోమవారం సాయంత్రం స్టేషన్ బెయిలుపై విడుదలయ్యారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్‌రెడ్డిలపై చేసిన రాజకీయ విమర్శలను సాకుగా చూపి ఆదివారం రమేష్‌కుమార్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.
రమేష్‌కుమార్‌రెడ్డిని ఫోన్‌లో
పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్