
వైభవం..పల్లకీ ఉత్సవం
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి పల్లకీలో ఊరేగారు. సోమవారం రాత్రి స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రంగు రంగులపూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి ఊరేగించారు.
జైళ్లశాఖ ఎఫ్‌ఏసీ
డీఐజీగా రవి కిరణ్
కడప అర్బన్: రాయలసీమ జైళ్ల శాఖ ఫుల్ అడిషనల్ చార్జ్ డీఐజీగా రవికిరణ్‌ను నియమిస్తూ డీజీ అంజనీ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీఐజీ, కడప సెంట్రల్ జైలు పర్యవేక్షణ అధికారిగా ఉన్న రాజేశ్వరరావును తొలగిస్తూ రవి కిరణ్‌కు పూర్తి బాధ్యతలను అప్పగించారు.
పచ్చిరొట్టతో భూసారం మెరుగు
కడప సెవెన్‌రోడ్స్: రైతులు పచ్చిరొట్ట ఎరువులను వినియోగించడం వల్ల భూసారం మెరుగవుతుందని ఇన్‌ఛార్జి కలెక్టర్ అదితిసింగ్ అన్నా రు. సోమవారం కలెక్టరేట్‌లో ‘పచ్చిరొట్ట ఎరువు తో మట్టికి జీవం’అనే వాల్ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ ఎరువుల వల్ల నీటి నిలుపుదల సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. మొక్కలు వేగంగా పెరగడం వల్ల కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుందన్నారు.
నిధులు మంజూరు
రాజుపాళెం: మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెల్లాలలోని శ్రీచెన్నకేశవ ఆలయ పున:నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరైనట్లు దేవదాయశాఖ ఉత్తర్వులు వచ్చాయి. దేవాదాయ శాఖ సీజీఎఫ్ నిధుల కింద రూ.3.20 కోట్లు, ఆలయ కాంట్రిబ్యూషన్ రూ.80 లక్షలతో ఈ నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే శ్రీసంజీవరాయ స్వామి ఆలయ నిర్మాణాకికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3.55 కోట్లు నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించారు. ఈ రెండు ఆలయాలు నిర్మాణాలు పూర్తయితే వెల్లాల పుణ్యక్షేత్రం మరింత శోభాయమానం కానుంది.
ఇంటర్ విద్య
బలోపేతానికి కృషి
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్ విద్య బలోపేతానికి కృషి చేస్తానని ఆర్‌ఐవో (ఎఫ్‌ఏసీ)గా బాధ్యతలు చేపట్టిన వేంకటేశ్వర్లు తెలిపా రు. సోమవారం ఆర్‌ఐవో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆర్‌ఐవోగా పనిచేసిన వెంకటసుబ్బయ్య నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీపై వెళ్లారు.