
అక్రమ కేసులతో పోరాటాలను ఆపలేరు
బద్వేలు అర్బన్: ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన చేసే పోరాటాలను ఆపలేరని, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి అన్నారు. రాజంపేట ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం స్థానిక నెల్లూరు రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి బైపాస్‌రోడ్డులోని వైఎస్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూస్తోందని మండిపడ్డారు. లిక్కర్ కుంభకోణంలో ఎంపీ మిథున్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు నిరూపించే ఒక్క ఆధారం కూడా పోలీసుల వద్ద లేకపోయినప్పటికీ కేవలం పెద్దిరెడ్డి కు టుంబం వైఎస్‌జగన్‌కి అండగా ఉంటుందన్న కారణంతోనే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారన్నారు.
ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి
ఎంపీ మిధున్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ బద్వేలులో ర్యాలీ