
బౌలర్ల ధాటికి చతికిలబడ్డ బ్యాటర్లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లో తొలి రోజు సోమవారం వైఎస్‌ఆర్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో అనంతపురం–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో అనంతపురం జట్టు 38.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఆదినారాయణ రెడ్డి 44 పరుగులు, సాత్విక్ 38 పరుగులు చేశారు.
చిత్తూరు జట్టులోని దినేష్ చక్కటి లైనప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు తీశాడు. తేజేష్ 2 వికెట్లు, నిహాల్ మాలిక్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 50.5 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మహ్మద్ షారుఖ్ అక్తర్ 81 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని దేవాన్ష్ 4 వికెట్లు, కిరణ్ కుమార్ 4 వికెట్లు తీశారు
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో...
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో కడప– నెల్లూరు. జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 29.3 ఓవర్లకు 78 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని గురు 25 పరుగులు చేశాడు. కడప జట్టులోని కాశ్యప్ రెడ్డి 5 వికెట్లు, గైబు 5 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 38.4 ఓవర్లకు 140 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నాగ కిషోర్ 21 పరుగులు, చిన్నకేశవ 21 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుశాంత్ 3 వికెట్లు, ఎస్‌వీ చైతన్య 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 19 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. కడప జట్టులోని గైబు 3 వికెట్లు తీశాడు. కడప బౌలర్ గైబు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయగా రెండవ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీయడం విశేషం. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
ప్రారంభమైన ఏసీఏ అండర్–16
మల్టీ డే మ్యాచ్‌లు

బౌలర్ల ధాటికి చతికిలబడ్డ బ్యాటర్లు

బౌలర్ల ధాటికి చతికిలబడ్డ బ్యాటర్లు

బౌలర్ల ధాటికి చతికిలబడ్డ బ్యాటర్లు

బౌలర్ల ధాటికి చతికిలబడ్డ బ్యాటర్లు