
రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు
వల్లూరు (చెన్నూరు) : చెన్నూరు మండల పరిధిలోని శాటిలైట్ సిటీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులకు గాయాలయ్యాయి. చెన్నూరు సీఐ కృష్ణారెడ్డి కథనం మేరకు వల్లూరు మండలం, రామిరెడ్డి కొట్టాలకు ఇరువురు ద్విచక్ర వాహనంపై కడప వైపు వెళుతుండగా శాటిలైట్ సిటీ వద్ద డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడడంతో 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నర్సింగ్ వృత్తి
ఎంతో పవిత్రమైంది
– ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి
కడప ఎడ్యుకేషన్ : వృత్తులో కెల్లా నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడప సాయికృప నర్సింగ్ కళాశాలలో జ్యోతి ప్రజ్వలన, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు, నర్సులు చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. సాయిబాబా విద్యాసంస్థల సీఈఓ ఎంవీ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకుని చదవాలని కోరారు. ప్రజలకు సేవచేయడానికి నర్సింగ్ వృత్తి దోహదపడుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ విద్యావతి మాట్లాడుతూ సాయికృప నర్సింగ్ కళాశాలలో అనేక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ నర్సింగ్ సూపరింటెండెంట్లు రమణమ్మ, కాంతమ్మతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళ మెడలో
గొలుసు లాక్కెళ్లారు
ఒంటిమిట్ట : మండలంలో మంటపంపల్లి గ్రామంలోని కడప–చైన్నె జాతీయ రహదారిౖపై ఈనెల 18న శుక్రవారం సాయంత్రం మహిళ మెడలోని గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు