
కూటమి ప్రభుత్వంలో చీనీ కాయల ధర పతనం
● నిమ్మకు నీరెత్తినట్లుగా మైనింగ్ శాఖ
సాక్షి ప్రతినిధి, కడప: వేముల కేంద్రంగా బైరెటీస్ నిక్షేపాల దోపిడీ బహిరంగంగా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. ఎన్సీఎల్టీ ద్వారా వేలంలో కొనుగోలు చేసి నిల్వ ఉంచిన కోట్లాది రూపాయల విలువైన ఖనిజం సైతం అపహరణకు గురైంది. ఏడాదిగా అక్రమార్కులకు అడ్డూ అదుపు లేదు. ఈ విషయాలపై మీడియా ఘోషించినా జిల్లా యంత్రాంగానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. కనీస విచారణ చేపట్టలేదు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో.. మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలుగు తమ్ముళ్ల వింత చేష్టలు, వికృత వైఖరి కారణంగా టీడీపీ పరువు ప్రతిష్ట దిగజారిపోతున్న వైనాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది.
లీజు అనుమతులు ఉన్నా..
అక్రమార్కుల కనుసన్నుల్లోనే
వేముల, వేంపల్లె మండలాల్లో ఏడాదిగా అక్రమ మై నింగ్ యథేచ్ఛగా సాగుతోంది. లీజు అనుమతులు ఉన్న వారైనా సరే.. అక్రమార్కుల కనుసన్నుల్లోనే మైనింగ్ నిర్వహించాలనే నిబంధనలు కూడా తెరపైకి వచ్చాయి. అక్రమ మైనింగ్ ద్వారా ఆదాయం గడించడం ఒక మార్గమైతే.. దౌర్జన్యం, దోపిడీలతో కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. 50 టన్నుల సామర్థ్యంతో తరలించే 20 లారీల ద్వారా సుమారు రూ.10 కోట్ల విలువైన నిల్వ ఉన్న బైరెటీస్ ఖనిజాన్ని దోచుకెళ్లారు. ఇలాంటి దుశ్చర్యలు మునుపెన్నడూ లేవు. సంక్రాంతి పండుగ సందడిలో అదును చూసి లూఠీ చేశారు. నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి వేలంలో ఎంబసీ గ్రూపు కొనుగోలు చేసింది. టిఫెన్ బైరెటీస్ కంపెనీ ప్రాంగణంలో నిల్వ ఉంచిన దాదాపు 3,500 టన్నులు దోచుకున్నారు.
బీటెక్ రవి డైరెక్షన్‌తోనే...
ఎన్సీఎల్టీ ద్వారా వేలంలో ఎంబసీ గ్రూపు కొనుగోలు చేసిన బైరెటీస్ ఖనిజం దోపిడీ వెనుక పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ఉన్నారని, ఆయన డైరెక్షన్‌లోనే టీడీపీ నేతలు పార్థసారధిరెడ్డి, మబ్బుచింతపల్లె శ్రీనాథరెడ్డి కొల్లగొట్టారని అప్పట్లో ఆ సంస్థ ప్రతినిధిగా రామలింగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల నుంచి ఎలాంటి చర్యల్లేవు. కంపెనీ స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు బిగించుకుంటున్న నేపథ్యంలో.. పార్థసారధిరెడ్డి సోదరుడు శేషారెడ్డి వాహనాల్లో వెళ్లి కెమెరాలు బిగిస్తున్న వారిని సైతం బెదిరించారు. ఇవన్నీ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైనా కనీస చర్యలు తీసుకోవాలనే స్పృహ అధికారులకు లేకపోయింది. తాజాగా ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి గురువారం సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పరువు ప్రతిష్టను ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి కాపాడుతున్నారని ఆ పార్టీ సీనియర్లు కొందరు వ్యాఖ్యానిస్తుంటే, మరికొందరు అక్రమార్కులంతా తెలుగు తమ్ముళ్లే కదానని హెద్దేవా చేస్తుండడం గమనార్హం.
వ్యవస్థలు నిర్వీర్యం కావడం వల్లే...
వ్యవస్థలు తనంతట తానుగా రాజ్యాంగానికి లోబడి వ్యవహరిస్తే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అప్పుడే కొంతలో కొంతైనా ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణగా నిలుస్తోంది. వ్యవస్థలు నిర్వీర్యం అయితే దౌర్జన్యపరులదే రాజ్యం, దోపిడీ దారులదే భోజ్యం అన్నట్లుగా ఉండిపోతుంది. సీసీ కెమెరాలు బిగిస్తుంటే టిఫెన్ బైరెటీస్ ప్రతినిధులను పేర్ల శేషారెడ్డి అండ్‌కో బెదిరింపులకు పాల్పడుతూ, తలకాయలు తీస్తామంటూ హెచ్చరికలు చేసినప్పుడే స్పందించాల్సి ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదు. ఆ తర్వాత రూ.10 కోట్ల విలువైన బైరెటీస్ ఖనిజం లూఠీ తెరపైకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి దుశ్చర్యలు తెరపైకి వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవి, పార్థసారధిరెడ్డి, శ్రీనాథరెడ్డి పేర్లు ప్రముఖంగా ప్రచా రంలోకి వచ్చాయి. అప్పట్లోనే నష్ట నివారణ చర్యలు చేపట్టింటే కొంతలో కొంతైనా అధికార పార్టీకి ప్రయోజనంగా నిలిచేది. టీడీపీ ఎమ్మెల్సీ ఫిర్యాదుతో రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు ఈ వ్యవహారం వెలుగు చూసింది.
అక్రమ మైనింగ్ కేరాఫ్ వేముల
కోట్ల విలువైన నిక్షేపాలుబహిరంగ దోపిడీ
ఎన్సీఎల్టీ ద్వారా కొనుగోలు చేసిన బైరెటీస్ అపహరణ
ఎంబసీ గ్రూపు ఫిర్యాదుపట్టించుకోని అధికార యంత్రాంగం
చర్చనీయాంశంగా సీఎంకుఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదు
అక్రమార్కులంతా తెలుగు తమ్ముళ్లే
మీడియా ఘోషిస్తున్నా స్పందన కరువు
వేముల, వేంపల్లె మండలాల్లో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతుండటం, ఈ కారణంగా చోటుచేసుకున్న బ్లాస్టింగ్‌లో అయ్యవారిపల్లెకు చెందిన రామచంద్ర మృతి చెందిన వైనం వెలుగు చూసిన సందర్భంలో కూడా మైనింగ్‌శాఖతోపాటు కలెక్టర్ కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు. ఎన్సీఎల్టీ ద్వారా వేలంలో కొనుగోలు చేసిన బైరెటీస్ ఖనిజం పల్వరైజింగ్ మిల్స్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఆ దిశగా కూడా కనీస విచారణ చేపట్టలేదు. ఆయా మినరల్స్ కంపెనీల్లో ఉన్న స్టాకు ఎంత? ఎవరి మైనింగ్ నుంచి ఎంత మోతాదులో తీసుకువచ్చారన్న విషయంపై రికార్డులను పరిశీలిస్తే లూఠీ వ్యవహారం నిగ్గుతేల్చే అవకాశం ఉండేది. అలాంటి చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం ఏమాత్రం చొరవ చూపలేదు. ఎమ్మెల్సీ ఫిర్యాదుతోనైనా జిల్లా అధికార యంత్రాంగం పనితీరులో మార్పు లభిస్తుందా? అక్రమార్కులను కట్టడి చేయనున్నారా? అపారమైన ఖనిజ నిక్షేపాలు కాపాడనున్నారా? ఇలాంటి ప్రశ్నలను విశ్లేషకులు సంధిస్తున్నారు. ఏమేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే!

కూటమి ప్రభుత్వంలో చీనీ కాయల ధర పతనం

కూటమి ప్రభుత్వంలో చీనీ కాయల ధర పతనం

కూటమి ప్రభుత్వంలో చీనీ కాయల ధర పతనం

కూటమి ప్రభుత్వంలో చీనీ కాయల ధర పతనం