
ఉత్సాహంగా ఫుట్‌బాల్ పోటీలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నగరంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. శుక్రవారం నగర శివార్లలోని డాక్టర్ వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్‌లో జోనల్ స్థాయి జూనియర్ బాలికల ఫుట్‌బాల్ పోటీలను స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి జగన్నాథరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సత్య సాయి వర్సెస్ కడప జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డేనియల్ ప్రదీప్, కడప ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సుధీర్, డాక్టర్ వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఫుట్‌బాల్ కోచ్ హరి, సిబ్బంది పాల్గొన్నారు.
ఫుట్‌బాల్ క్రీడాకారులతో నిర్వాహకులు