కడప అర్బన్ : జిల్లాలో గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్ ఆదేశించారు. స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు ముమ్మరం చేయాలని, శివారు ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెంచాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్టేషన్ కు వచ్చే మహిళలు, ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. వైన్ షాపుల వద్ద నిబంధలకు విరుద్ధంగా మద్యం తాగితే చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దష్టి పెట్టాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నక్షుంచి, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించాలని కోరారు. క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మట్కా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.సైబర్ నేరాలు, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దాబాలు, హోటళ్లు, లాడ్జిలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. రాత్రి గస్తీ పెంచాలని ఆదేశించారు. అనంతరం ఇటీవల కోర్టులో జీవిత ఖైదు శిక్ష పడేలా కృషిచేసిన సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఎన్.సుధాకర్, ఇ.బాలస్వామిరెడ్డి, అబ్దుల్‌కరీం, ఎ.వెంకటేశ్వర్లు, పి.భావన, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వరరావు, మురళినాయక్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు ద్విచక్ర వాహనాలు
కడప అర్బన్ : ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన బుల్లెట్, 15 ద్విచక్ర వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ శుక్రవాం ప్రారంభించారు. మంగళగిరి నుండి వచ్చిన ఈ వాహనంలో సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ టెక్నాలజీ ఉన్నాయన్నారు. కడపకు ఏడు, ప్రొద్దుటూరుకు నాలుగు, పులివెందులకు రెండు, జమ్మలమడుగు, బద్వేల్, మైదుకూరుకు ఒక వాహనం కేటాయించారు. ఫోర్ వీలర్ వెళ్ళలేని ప్రాంతాలలో టూ వీలర్స్ ఉపయోగిస్తారని, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తారని ఎస్పీ తెలిపారు. న్నా
నేర సమీక్షా సమావేశంలో
ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్
గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు
గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు