ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు

Jul 18 2025 5:16 AM | Updated on Jul 18 2025 5:16 AM

ప్రభుత్వ భూములను  ఆక్రమిస్తే చర్యలు

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు

కాశినాయన : ప్రభుత్వ, అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్‌ తెలిపారు. మండలంలోని నాయునిపల్లె రెవెన్యూ పొలంలో ఆక్రమించిన ప్రభుత్వ, అటవీ భూములను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ నాయునిపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్‌ 129/1, 130, 217లో దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల చుట్టూ స్ట్రెంచ్‌ తీయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. వెంటనే ఆక్రమిత పొలాల్లో నోటీసు బోర్డు ఏర్పాటుచేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటసుబ్బయ్య, డీటీ రవిశంకర్‌, ఆర్‌ఐ అమరనాథ్‌రెడ్డి, సర్వేయర్లు, వీఆర్‌ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement