
పల్లెల్లో విద్యుత్తు అధికారుల తనిఖీలు
బ్రహ్మంగారిమఠం : మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్తు అధికారులు గురువారం విస్త్రతంగా తనిఖీలు నిర్వహించారు. మైదుకూరు డివిజన్ పరిధిలోని 40 మంది విద్యుత్తు సిబ్బంది 24 బ్యాచ్‌లుగా ఏర్పడి తనిఖీల్లో పాల్గొన్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ చౌర్యం చేస్తున్న వారిపై 55 కేసులు నమోదు చేసి రూ.2 లక్షల అపరాద రుసుము వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం బి.మఠం సబ్ స్టేషన్ వద్ద జరిగిన సమావేశంలో మైదుకూరు డివిజన్ ఈఈ ఎన్.భరణీకృష్ణ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వ్యవసాయ మోటార్లకు సంబంధించి రూ.3.59 కోట్లు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రూ.4 కోట్ల విద్యుత్తు బకాయిలు ఉన్నాయన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బిల్లులు వసూలు చేస్తామన్నారు. వినియోగ దారులు సకాలంలో బిల్లు చెల్లిస్తే అపరాధ రుసుము పడదన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రవిచంద్ర, డీఈఈలు కుళ్లాయప్ప, శ్రీకాంత్, ఏఏఓ శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
55 విద్యుత్తు చౌర్యం కేసులు నమోదు