
ఒంటరి మహిళలే టార్గెట్
కడప అర్బన్ : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు చైన్ స్నాచింగ్‌కు పాలం్పడిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 52 గ్రాముల బంగారు చైన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో విలేకరులకు గురువారం వివరాలు తెలిపారు. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన పట్టనేతి నవీన్(26) గత కొద్ది నెలలుగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిపారు. కడప రూరల్ సీఐ చల్లనిదొర, పెండ్లిమర్రి ఎస్‌ఐ జి.మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది ఈ నెల 2వతేదీన నవీన్‌ను అరెస్ట్ చేశారని తెలిపారు. విచారించి అతడి నుంచి 1,150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని జైలుకు పంపినట్లు తెలిపారు. అనంతరం జూలై 16న పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించగా నిందితుడు నవీన్ ఆరుచోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు రుజువైందని తెలిపారు, తొండూరు, చెన్నూరు, పులివెందుల, గంగిరెడ్డిపల్లి పోలీస్‌స్టేషన్, కమలాపురం, పెండ్లి మర్రి పోలీస్ స్టేషన్లలోని పలు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అక్కడ చోరీ చేసిన బంగారు చైన్లు అమ్మడానికి ప్రయత్నించినప్పుడు దుకాణదారులు నిందితుడిని తగిన రసీదు చూపించమని అడిగారన్నారు. భయంతో తిరిగి తన ఇంటిలోనే బంగారు గొలుసు దాచి పెట్టారని తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడిని విచారించి బంగారు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు, రికవరీ చేయడంలో కృషి చేసిన సీఐ, ఎస్‌ఐలతోపాటు క్రైమ్ స్టేషన్ ఏఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బంది బాషా, బి.రవి కుమార్, సుభాన్‌బాషా, కిరణ్‌కుమార్, సూర్యప్రకాశ్‌రెడ్డిలను ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.
చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన
దొంగ అరెస్ట్
రూ.15.32 లక్షల విలువైన చైన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం
విలేకరుల సమావేశంలో
కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు

ఒంటరి మహిళలే టార్గెట్