
గాయపడిన వ్యక్తి మృతి
పెండ్లిమర్రి : మండలంలోని నందిమండలం గ్రామానికి చెందిన పి.కాళీప్రసాద్(54) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... బుధవారం రాత్రి ఇంటి నుంచి ద్విచక్ర వాహనంలో ప్రసాద్ కడపకు బయలుదేరాడు. యోగి వేమన యూనివర్శిటీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్‌షాక్‌తో ఎద్దు, దూడ మృతి
మైలవరం : మండలంలోని తొర్రివేముల గ్రామానికి చెందిన మహిళా రైతు వెంకట సుబ్బమ్మకు చెందిన ఎద్దు, అవు దూడ విద్యుత్ షాక్‌తో గురువారం మృతిచెందాయి. బాధితురాలి వివరాల మేరకు.. పొలం వద్ద గడ్డి మేపుకోవడానికి సుబ్బమ్మ ఎద్దులు, ఆవుదూడలను విడిచిపెట్టింది. బోరుబావి వద్ద ఉన్న స్టార్టర్ వద్దకు వెళ్లిన ఎద్దు పొరపాటున స్టార్టర్‌కు తగలడంతో అక్కడ ఉన్న తీగలు పశువులపై పడ్డాయి. విద్యుత్తు షాక్ తగలడంతో రెండు పశువులు మృతి చెందినట్లు బాధితురాలు తెలిపారు. పశుసంవర్ధక శాఖ అధికారులు పరిశీలించినట్లు తెలిపారు.
బోగాధమ్మ ఆలయంలో చోరీ
కమలాపురం : మండలంలోని పందిళ్లపల్లె శివారులో ఇటీవల పునర్నిర్మించిన బోగాధమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయం తాళం పగులగొట్టి హుండీని రంపంతో కోసి అందులో నగదు చోరీ చేశారు. ఆలయం బయట పడేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు తెలిపారు.
రైల్వే స్టేషన్ గోదాములో తనిఖీలు
కడప అగ్రికల్చర్ : కడప రైల్వేస్టేషన్‌లోని రేక్ పాయింట్, ట్రాన్స్‌పోర్టు గోదాముల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ మల్లికార్జునరావు, కర్నూలు డీఆర్సీ ఏడీఏ వెంకటేశ్వర్లు, కడప ఏవోలు గోవర్ధన్, సురేష్‌కుమార్‌రెడ్డి గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎరువు నిల్వలు, పంపిణీకి సంబంధించిన పత్రాలు, రికార్డులు పరిశీలించారు. జిల్లాకు 991 మెట్రిక్ టన్నుల ఎరువు వచ్చినట్లు తెలిపారు. సరైన పత్రాలు చూపితేనే జిల్లాలోని డీలర్లు, రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్ కేంద్రాలకు పంపిణీ చేయాలని సిబ్బందికి వారు సూచించారు. గోదాముల్లో నిషేధిత పురుగు మందులు ఉన్నాయా అని తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు పంపేవారు, తీసుకునేవారి చిరునామాలు నమోదు చేయాలని సూచించారు.

గాయపడిన వ్యక్తి మృతి

గాయపడిన వ్యక్తి మృతి