
18న చలో ఢిల్లీ
బద్వేలు అర్బన్ : కడపలో ఉక్కు పరిశ్రమ హామీ అమలు కోరుతూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ నెల 18న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.చిన్ని పేర్కొన్నారు. స్థానిక డీవైఎఫ్‌ఐ కార్యాలయ ఆవరణలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పది రోజుల్లో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభిస్తామని మహానాడులో చంద్రబాబు చెప్పినా, నేటికీ పనులు ప్రారంభం కాలేదనిన్నారు. ఈ కార్యక్రమంలో మస్తాన్‌షరీఫ్, ఆదిల్, ఓబుల్‌రెడ్డి, సుధాకర్, నరసింహ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
కర్నాటక మద్యం స్వాధీనం
మదనపల్లె రూరల్ : ఎకై ్సజ్ బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది గురువారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 12.96 లీటర్ల ఎన్‌డీపీఎల్ కర్నాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి టూవీలర్ సీజ్ చేసినట్లు సీఐ సత్య శ్రీనివాస్ తెలిపారు. మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... కర్నాటక సరిహద్దు చీకలబైలు చెక్‌పోస్ట్‌కు సమీపంలో బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా, కురబలకోట మండలం తుంగావారిపల్లెకు చెందిన మూలి రమేష్(27), కర్నాటకకు చెందిన బెంగళూరు మాల్ట్ విస్కీ(90ఎం.ఎల్) 96 టెట్రా ప్యాకెట్లు, సుజుకీ ఆక్సెస్ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. అతడి నుంచి రూ.3,840 విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకుని, టూవీలర్‌ను సీజ్ చేశామన్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన పెద్దిగాని సోమశేఖర్(28), కర్నాటకకు చెందిన హైవార్డ్స్ ఛీర్స్ విస్కీ(90ఎం.ఎల్) 48 టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. రెండు కేసుల్లోనూ ఇద్దరిని అరెస్ట్‌చేసి ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించామన్నారు.
పోక్సో కేసులో నిందితుడికి జైలుశిక్ష
మదనపల్లె రూరల్ : పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరు పోక్సో కోర్టు జడ్జి ఎం.శంకరరావు శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు వన్‌టౌన్ సీఐ ఎరిషావలి తెలిపారు. పట్టణంలోని సుభాష్ రోడ్డుకు చెందిన టి.చంద్రశేఖర్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలికల హైస్కూల్ వద్ద 2017 మార్చి, 3న స్కూల్‌కు వెళ్లే విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అప్పటి హెచ్‌ఎం పద్మజ ఫిర్యాదు మేరకు, ఎస్‌ఐ మనోహర్ పోక్సో కేసు నమోదు చేశారన్నారు. కోర్టు విచారణ అనంతరం శుక్రవారం చిత్తూరు పోక్సో కోర్టులో నిందితుడు చంద్రశేఖర్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ..5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారన్నారు.

18న చలో ఢిల్లీ