
● రాజోలికి జలకళ
కృష్ణా జలాలతో రాజోలి ఆనకట్ట జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వరద నీరు రాజుపాళెం మండల పరిధిలోని రాజోలి ఆనకట్టకు భారీగా వచ్చి చేరుతోంది. ఆదివారం ఆనకట్ట నుంచి కుందూనదిలోకి 4479 క్యూసెక్కులు నీరు పోతోందని కేసీ కెనాల్ అధికారులు వెల్లడించారు. కేసీ ప్రధాన, చాపాడు కాలువలకు నీరు అధికారికంగా విడుదల చేయలేదని తెలిపారు. ఇప్పటికే సాగు చేసిన మొక్కజొన్న పంటకు నీటితడులు అందించగా పత్తి, వరి పంటలను సాగు చేసుకునేందుకు రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. – రాజుపాళెం

● రాజోలికి జలకళ

● రాజోలికి జలకళ