
రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ రాక
పులివెందుల: మాజీ సీఎం,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల జిల్లా పర్యటనకు రాను న్నారు. సోమవారం సాయంత్రం పులివెందులకు చేరుకొని.. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు చేరుకుని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అక్కడ నుంచి పులివెందులకు చేరుకుని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. అదే రోజు సాయంత్రం బెంగుళూరుకు బయలుదేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రెండు రోజుల పర్యటన వివరాలు
వైఎస్ జగన్ ఈనెల 7న సాయంత్రం పులివెందులలో ని భాకరాపురం హెలీప్యాడ్‌కు 5గంటలకు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి పులివెందులలో బస చేయనున్నారు. ఈనెల 8న ఉదయం 6.45గంటలకు పులివెందులలోని తన స్వగృహం నుంచి వాహనంలో రోడ్డు మార్గాన బయలుదేరి 7.30గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. 8.15గంటల వరకు ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 8.45గంటలకు పులివెందుల క్యాంప్ ఆఫీస్‌కు చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం బెంగళూరుకు బయలుదేరుతారు.