
అట్టహాసంగా ప్రమాణ స్వీకారం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో ఆర్యవైశ్య సభ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. వరుసగా ఎనిమిదో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బుశెట్టిరాంమోహన్‌రావు మాట్లాడుతూ ఆర్యవైశ్య సభ ఖ్యాతిని నలుదిశాల ఇనుమడింపచేస్తామని, దసరా ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా బుశెట్టి రాంమోహన్‌రావు, ఉపాధ్యక్షుడిగా జొన్నలగడ్డ రవీంద్ర బాబు, కార్యదర్శిగా మురికి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా మల్లెంకొండు ప్రతాప్, గౌరవ సభ్యులుగా వంకధార వీరభద్రయ్య, జొన్నలగడ్డ రామచంద్ర ప్రకాష్, పోలేపల్లి రాజబాబు, రేగంటి సురేష్‌బాబు, మురికి మల్లిఖార్జునలతో పాటు 24 మంది సభ్యులతో సభ లీగల్ అడ్వయిజర్ కొప్పర్తి మధుసూదన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాంమోహన్ రావును వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి శాలువ కప్పి సత్కరించారు. జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్పిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, పిట్టా బాలాజీ, భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డిలు పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, జీవీ ప్రవీణ్ కుమార్‌రెడ్డిలతోపాటు పలువురినీ సత్కరించారు.