
ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
– డీఈఓ షేక్ షంషుద్దీన్
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ఉపాధ్యాయులు జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ దరఖాస్తులను జులై 13వ తేదీ వరకు ఆన్‌లై న్ పోర్టల్ htt pr://nationalawardstotea chers.education.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ తెలిపారు. అర్హతలు, ఇత ర సమాచారం కోసం పై వెబ్‌సెట్‌నే సంప్రదించాలని డీఈఓ పేర్కొన్నారు.
ఢిల్లీ వర్క్‌షాప్‌లో కలెక్టర్
కడప సెవెన్‌రోడ్స్ : కేంద్ర ప్రభుత్వ బొగ్గు, ఖనిజ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఖనిజ క్షేత్ర నిధి సంస్థల నిర్వహణపై బుధవారం న్యూ ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి వర్క్ షాప్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భారత ప్రభుత్వ ఖనిజ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డీఎల్ కాంతారావు, వివిధ రాష్ట్రాల జిల్లా కలెక్టర్లు, గనులు, భూగర్భ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో జిల్లా ఖనిజ క్షేత్ర నిధి సంస్థల నిర్వహణ ప్రణాళిక, అమలు అనే అంశంపై నియమించిన కమిటిలో జిల్లా కలెక్టర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత బొగ్గు , గనుల మంత్రిత్వశాఖ తరుపున కలెక్టర్‌కు జ్ఞాపిక అందించి సత్కరించారు.
11న జాబ్‌మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 11న కడప నగర శివార్లలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కులోని టిరోవిజన్ కంపోజిట్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్మీడియేట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, డిగ్రీ చదివి 18 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న వారికి అర్హతనుబట్టి రూ. 10–50 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాలు, ఫొటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.
నేడు జిల్లా వ్యాప్తంగా
తల్లిదండ్రుల సమావేశం
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నేడు తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా 4 నుంచి 10వ తరగతి విద్యార్థుల చేత మొక్కలు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దీని కోసం ప్రభుత్వం ఒక్కో మొక్కకు రూ. 7.85 కేటాయించి నిధులను విడుదల చేసింది. ఒక్కో విద్యార్థి తమ తల్లి పేరుతో మొక్కనాటేలా రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే విద్యార్థి ప్రొగ్రెస్, హాలిస్టిక్ రిపోర్టు పేరుతో విద్యార్థి అభ్యసన, ఆరోగ్య తదితర వివరాలు అందులో పొందుపరిచి చర్చించడంతోపాటు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమలను తెలియచేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో 2818 ప్రభుత్వ, ప్రైవేటు బడులతోపాటు 155 ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, హైస్కూల్ ప్లస్, సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలల్లో కూడా నిర్వహించనున్నారు.
వెబ్ ఆప్షన్స్ నమోదుకు
12 వరకు అవకాశం
రాయచోటి జగదాంబసెంటర్ : రెండు సంవత్సరాల డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) కోర్సుకు జరిగిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు డైట్‌లో సీటు పొందడానికి ఆన్‌లైన్ వెబ్ ఆధారంగా ఆప్షన్స్ ఇచ్చుకునేందుకు ఈ నెల 9 నుంచి 12 వరకు అవకాశం కల్పించినట్లు ప్రిన్సిపాల్ ఎంఆర్‌ఎస్ అజయ్‌కుమార్‌బాబు తెలిపారు. బుధవారం రాయచోటిలోని డైట్ విద్యా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న వారికి సీట్లు కేటాయించి ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 25 నుంచి డైట్‌లో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయన్నారు. రాయచోటి డైట్ తెలుగు మీడియంలో 50, ఆంగ్ల మాధ్యమంలో 50, ఉర్దూ మాధ్యమంలో 50 సీట్లు ఉన్నాయన్నారు. డీఈఈసెట్‌లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఇతర వివరాలకు డైట్ సీనియర్ లెక్చరర్ మడితాడి నరసింహారెడ్డిని (9440246825 నంబర్‌లో) సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డైట్ సీనియర్ లెక్చరర్ మడితాటి నరసింహారెడ్డి, డైట్ లెక్చరర్స్ వైసీ రెడ్డప్పరెడ్డి, తిరుపతి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.