
వైభవం.. సౌమ్యనాథుని గరుడోత్సవం
నందలూరు : సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు బుధవారం రాత్రి స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గరుడవాహనసేవ దిగువవీధి, పేటగడ్డ, బస్టాండ్ మీదుగా అరవపల్లి వరకు సాగింది.గరుడసేవ తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు.అరవపల్లిలో శ్రీ ముత్తు మారెమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన విడిదిలో ఉభయదారులు కుర్ర మణియాదవ్, ప్రభావతి దంపతులను మంగళవాయిద్యాలతో ఆహ్వానించి పూజలు జరిపించారు. బుధవారం ఉదయం పుష్పాలంకరణ ప్రియుడైన సౌమ్యనాథస్వామి మోహిని అలంకారంలో శేషవాహనంపై మాఢవీధుల్లో విహరించారు.ఊరేగింపు సందర్భంగా కడపకు చెందిన గణేష్ కోలాటం బృందం కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.
బ్రహ్మోత్సవాలలో నేడు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గురువారం ఉదయం శ్రీ సౌమ్యనాధ స్వామి ఉదయం సూర్యప్రభ, రాత్రికి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు.