
క్రీడా పాఠశాల ప్రవేశాలకు ఎంపిక
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలలో 2025–26 సంవత్సరంలో నాలుగో తరగతి ప్రవేశాలకు బుధవారం ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి ఆధ్వర్యంలో సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఎత్తు, జరువు, మెడికల్ టెస్ట్ , స్టాడింగ్ బ్రాడ్ జంప్, షాట్‌పుట్, 30 మీటర్ల ప్‌లైయింగ్ స్టార్ట్, రన్నింగ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 27 మంది హాజరుకాగా, మెడికల్ టెస్ట్ పరీక్షలో నలుగురిని తిరస్కరించారు. క్రీడా మైదానంలో అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. వివిధ కారణాలతో హాజరుకాని తొమ్మిది మంది బాల, బాలికలు ఈ నెల 11న నిర్వహించే ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. 11న ఐదో తరగతి ప్రవేశాలకు ఎంపిక జరుగుతుందని, ఆన్‌లైన్‌లో అర్హులైన విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు.

క్రీడా పాఠశాల ప్రవేశాలకు ఎంపిక