కమిషనర్ సారూ.. ఇదేం తీరు.!
కడప కార్పొరేషన్ : కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి తీరు రోజురోజుకు వివాదాస్పదం అవుతోంది. ఎమ్మెల్యే మాధవికి తొత్తుగా మారి పక్షపాత ధోరణి ప్రదర్శించడం పట్ల విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. సోమవారం నాటి సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలుపొంది నగర పాలకవర్గ సభ్యులుగా ఉన్న పదిమంది కార్పొరేటర్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెళ్లి వినతి పత్రం ఇస్తే కమిషనర్ చాలా నిర్లక్ష్యంగా కూర్చుని వినతి పత్రం స్వీకరించారు. అదే రీతిలో ఎలాంటి ప్రొటోకాల్ లేని సామాన్య టీడీపీ కార్యకర్తలు వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే అత్యంత వినయ విధేయతలతో నిలబడి వినతిపత్రం స్వీకరించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల మాటలకు, వారి సూచనలకు ఎంతటి విలువనిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. డిప్యూటీ కలెక్టర్ స్థాయి హోదాలో ఉన్న కమిషనర్ ఇలా దిగజారి ప్రవర్తించడాన్ని పలువురు తప్పు బడుతున్నారు. ఇప్పటికై నా ఆయన వైఖరి మార్చుకోవాలని, ప్రజా సమస్యల పట్ల అందరితోనూ ఒకే రకంగా వ్యవహరించాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు. వారిలో మూడుసార్లు వరుసగా గెలుపొందిన సీనియర్ కార్పొరేటర్లు కూడా ఉండటం గమనార్హం.
అధికార పార్టీ నేతలకు గులాంగిరి
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి
వెల్లువెత్తుతున్న విమర్శలు
కమిషనర్ సారూ.. ఇదేం తీరు.!


