
చెరువు మట్టితో టీడీపీ నేత వ్యాపారం
ఖాజీపేట : ఎదుటి వారికి చెప్పేందుకే నీతులుంటాయి అన్న మాటలు వారికి వర్తించవేమో.. ఓ వైపు మైదుకూరు, దువ్వూరు చెరువులు, కొండల నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు మట్టి తరలిస్తుంటే రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్.. ఖాజీపేట మండలం దుంపలగట్టు చెరువు నుంచి కొన్ని రోజులుగా వందల ట్రాక్టర్లతో టీడీపీ నేత మట్టిని తరలిస్తూ లక్షలు సంపాదిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని రైతులు, టీడీపీ వర్గీయులు నివ్వెరపోతున్నారు. కర్నూలు–కడప జాతీయ రహదారి సమీపంలో ఖాజీపేట మండలంలోని దుంపలగట్టు చెరువులో ఇటీవల కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌గా ఎన్నికై న ఓ టీడీపీ నేత రాత్రింబవళ్లు జేసీబీలు పెట్టి ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ ఒక్కో గ్రామానికి ఒక్కో రేటు చొప్పున విక్రయిస్తున్నారు. దుంపలగట్టు చెరువు నుంచి రాములపల్లె చెరువులోకి దారి ఏర్పాటు చేసి అక్కడి నుంచి హైవే రోడ్డు మీదుగా చెన్నూరు, ఖాజీపేట మండలాల్లో అన్ని గ్రామాలకు మట్టిని తరలిస్తూ అమ్ముకుంటున్నారు.
అనుమతులు లేవు.. నిబంధనలు వ్యతిరేకిస్తూ..
దుంపలగట్టు చెరువులో కేసీ కెనాల్ తూముల కంటే తక్కువ లోతుకు చెరువు చేరుకుంది. ఈ క్రమంలో చెరువు మట్టి మరింత లోతుగా తీస్తే పంట పొలాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈనే పథ్యంలో దుంపలగట్టు చెరువులో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ టీడీపీ వర్గీయు డు దర్జాగా చెరువు చెరబట్టి త్రవ్వకాలు జరుపుతూ మట్టిని అమ్ముకోవడం శోచనీయం. టీడీపీ ప్రభు త్వం ఏర్పాటైన ఏడాదిలో కడప నగర సమీపంలో మహానాడు నిర్వహించేందుకు ఓ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు కడప–కర్నూలు జాతీయ రహ దారి వెంటే వెళ్తున్నారు. ఈ దారి పక్కనే దుంపలగట్టు చెరువు నుంచి టీడీపీ వర్గీయులు వందల సంఖ్యలో ట్రాక్టర్లు పెట్టి అక్రమంగా మట్టితరలిస్తున్నా పట్టించుకోకపోడం విస్మయం కలిగిస్తోంది. అక్రమ మట్టి త్రవ్వకంపై ఆర్డీఓ, తహసీల్దారు, కేసీ కెనాల్ అధికారులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిప్రతినిధులు, అధికారులు స్పందించి దుంపలగట్టు చెరువులోని మట్టి అక్రమ రవాణపై చర్యలు తీసు కుని చెరువును కాపాడాలని కోరుకుంటున్నారు.
దుంపలగట్టు చెరువు నుంచి
అక్రమంగా మట్టి తరలింపు
ఫిర్యాదు అందినా పట్టించుకోని రెవెన్యూ, కేసీ కెనాల్ అధికారులు
ఈ దారి నుంచే మహానాడు ప్రాంగణానికి టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు