
దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపర్చడమే లక్ష్యం
కడప అర్బన్: నేరం చేసిన వారు ఎట్టి పరిస్థితుల లో చట్టం నుంచి తప్పించుకోకూడదని, వారికి శిక్షపడాలంటే ఆధారాల సేకరణలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని ఎస్పీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ’పెన్నార్’పోలీస్ కాన్ఫరెన్స్ హాలులోవర్క్ షాప్ నిర్వహించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వాస్పత్రి వైద్యులు, పబ్లిక్ ప్రాసి క్యూటర్లకు ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, నిర్వహణ, చైన్ ఆఫ్ కస్టడీ మార్గదర్శకాలు, నేర పరిశోధనలో అనుసరించవలసిన విధి విధానాలు, ఆధునిక శాసీ్త్రయ ప్రమాణాలు తదితర అంశాలపై ఫోరెన్సిక్ నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇచ్చా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దర్యాప్తు అధికారులు నేరం జరిగిన చోటును ఏ విధంగా రక్షణ కల్పించాలి, నేర స్థలంలో డి.ఎన్.ఏ, రక్త నమూనాలు, మానవ అవయవాలు, నార్కోటిక్స్, మత్తు పదార్థాలు, వివిధ రకాల విషాలు, ఆడియో, వీడియో, వివిధ పత్రాలు, భౌతిక సాక్ష్యాధారాలను ఏవిధంగా సేకరించాలి తదితర అంశాలపై వర్క్ షాప్‌లో ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. నేరస్తులకు కోర్టుల్లో శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయన్నారు. ఆ దిశగా అత్యంత అధునాతన శాసీ్త్రయ ప్రమాణాలు, పద్ధతులు అందిపుచ్చుకోవాలన్నారు. కేసులు దర్యాప్తు చేపట్టి కేసులు విచారణ ప్రారంభమైన సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమన్వయంతో దోషు లకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాసీ్త్రయ పద్దతిలో కేసుల దర్యాప్తు ఉండాలన్నారు. సేకరించిన సాక్ష్యాధారాలను ఏ విధంగా భద్రపరచాలి.. భద్రపరిచిన వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపే సమయంలో ఎలా ప్యాకింగ్ చేయాలి. సదరు ఆధారాల ద్వారా ఎలాంటి సమాచారం కోరుకుంటున్నామో ఎలా తెలియజేయాలి అనే అంశాలను గురించి నిపుణులు విపులంగా వివరించారు. సాక్ష్యాల సేకరణలో చేయకూడని పొరపాట్లు గురించి విశదీకరించారు. నిపుణులు తెలియజేసిన అంశాలకు గురించి, పోలీస్ అధికారులు వారికున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. అనంతరం వర్కు షాపులో పాల్గొన్న ఫోరెన్సిక్ నిపుణులు హాసిం బాషా, డా.ఎం.కిషోర్ కుమార్ రెడ్డి, కుమారస్వామి, శ్యాంప్రసాద్ లను ఎస్పీ అశోక్ కుమార్ సత్కరించి, జ్ఞాపికలను బహూకరించారు. అదనపు ఎస్.పి కె.ప్రకాష్ బాబు, డీడీ ప్రాసిక్యూషన్స్ ఎస్.ఖదీరున్నీసా, డీఎస్పీలు సుధాకర్, జి.వెంకటేశ్వ ర్లు, భావన, రాజేంద్రప్రసాద్, బాలస్వామి రెడ్డి, భవాని, డీసీఆర్‌బీ సీఐ ఈశ్వర్ రెడ్డి, ఎస్.బి ఇన్‌స్పెక్టర్ దారెడ్డి భాస్కర్ రెడ్డి, కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇంచార్జ్ సీఐ వినయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేరస్థులకు శిక్ష పడటంలోశాసీ్త్రయ పద్ధతిలో ఆధారాల సేకరణ కీలకం
ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్

దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపర్చడమే లక్ష్యం