
పాడి గేదెలను తీసుకెళుతున్న వ్యక్తిపై దాడి
చాపాడు : మండల పరిధిలోని చిన్నగురువళూరు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం పాలగిరి చంద్రమోహన్‌రెడ్డి అనే వ్యక్తిపై పాలెంపల్లె ప్రభాకర్‌రెడ్డి అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చంద్రమోహన్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పాడి గేదెలు మేపుకుని వాటిని శుభ్రం చేసుకునేందుకు కుందూనది ఏటికి వెళుతుండగా మద్యం మత్తులో ఉన్న పాలెంపల్లె ప్రభాకర్‌రెడ్డి కట్టెతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చాపాడు పోలీసులు తెలిపారు.

పాడి గేదెలను తీసుకెళుతున్న వ్యక్తిపై దాడి