బెల్ట్‌షాపులపై దాడులు
కమలాపురం : కమలాపురం పట్టణంలోని బెల్ట్ షాపులపై ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. మంగళవారం ఎకై ్సజ్ సీఐ గోపీక్రిష్ణ తన సిబ్బందితో ఈ దాడులు నిర్వహించారు. కమలాపురం పట్టణంతో పాటు మండలంలో పుట్టగొడుగుల్లా బెల్ట్‌షాపులు వెలిశాయి. పట్టణంలో 7 బెల్ట్‌షాపులు నడుస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో దాడులు చేశామని సీఐ తెలిపారు. కాగా దాడుల సమయంలో కేవలం ఒక షాపులో మాత్రమే 6 క్వార్టర్ మద్యం బాటిళ్లు లభించాయని, నిర్వాహకుడు గోపాల్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. కాగా పట్టణంలో అర కిలోమీటరుకు ఒక బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, బెల్ట్‌షాపులను పూర్తిగా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
బ్రహ్మంగారిమఠంలో
బ్రహ్మంగారిమఠం : పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో బెల్ట్ షాపులపై బి.మఠం పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ‘సాక్షి’లో ప్రచురితమైన బెల్ట్‌పై కొరవడిన నిఘా అనే వార్తతో పోలీసుల్లో చలనం వచ్చింది. బి.మఠం టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. రెండు వర్గాలకు చెందిన వారు పోటాపోటీగా బెల్ట్‌షాపులను ఏర్పాటు చేయించారు.
20 మద్యం బాటిళ్లు పట్టివేత
చాపాడు : మండల పరిధిలోని సోమాపురం గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న 20 మద్యం బాటిళ్లను సోమవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ట్రైనీ డీఎస్పీ భవానీ సిబ్బందితో కలసి గ్రామంలోని బెల్టు షాపులపై దాడులు నిర్వహించగా గ్రామానికి చెందిన రాధా అనే మహిళ ఇంటి వద్ద నిర్వహిస్తున్న దుకాణంలో సోదాలు చేయగా రూ.2వేలు విలువ చేసే 20 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు.
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : తన ప్రేమ విఫలమైందనే బాధతో వెంకటనరసింహులు (24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రొద్దుటూరులో జరిగింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన సానా లక్ష్మీదేవికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. పెద్ద కుమారుడు సురేష్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా మరో కుమారుడు వెంకటనరసింహులు కాంట్రాక్ట్ పనులు చేసుకునేవాడు. వీరు తొగట కులస్తులైనప్పటికీ క్రైస్తవ మతంలోకి మారారు. వెంకటనరసింహులు కొన్ని నెలల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాడు. అయితే వారి మధ్య ఏం జరిగిందో ఏమోగానీ ప్రేమ విఫలమైంది. ఈ విషయమై అతను కొన్ని రోజుల నుంచి తనలో తాను బాధ పడుతూ ఉండేవాడు. ఆ అమ్మాయి ఎవరో చెబితే తాము వెళ్లి మాట్లాడుతామని కుటుంబ సభ్యులు పలుమార్లు అడిగినా అతను చెప్పలేదు. ‘నాకు బతకాలని లేదు.. జీవితంపై విరక్తి కలుగుతోంది.. బతకడం కంటే చనిపోవడం మేలు’ అని చెబుతూ ఉండేవాడు. అయినా కుటుంబ సభ్యులు వెంకటనరసింహులుకు ధైర్యం చెబుతూ సముదాయించేవారు. ఈ క్రమంలో ఈస్టర్ పండుగ సందర్భంగా కడపలో ఉన్న చెల్లెలు శిరీష, హైదరాబాద్‌లో ఉంటున్న అన్న సురేష్ ఇంటికి వచ్చారు. పండుగ అనంతరం సోమవారం చెల్లెలిని వదిలి పెట్టేందుకు సురేష్‌తో పాటు తల్లి లక్ష్మీదేవి కడపకు వెళ్లారు. వారు రాత్రి ఇంటికి వచ్చి చూడగా వెంకటనరసింహులు ఇంటి రేకులకు ఉన్న ఇనుప పైపునకు చీరను చుట్టి ఉరేసుకున్నాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. ఈ మేరకు మృతుడి అన్న సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ సంజీవరెడ్ది తెలిపారు.


