నిండు జీవితానికి రెండు చుక్కలు
కడప రూరల్: చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కల మందు దోహదపడుతుందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం సందర్భంగా పులివెందులలో చిన్నారులకు చుక్కల మందు వేశారు. కడపలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమామహేశ్వర కుమార్ మాట్లాడుతూ తొలిరోజు 94శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేశామని వివరించారు. వైద్య సిబ్బంది సోమ, మంగళవారం ఇంటింటికి వచ్చి తొలిరోజు వేయించని చిన్నారులకు చుక్కల మందు వేస్తారని తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారుల కు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
● తొలి రోజు 94శాతం నమోదు


