ఓన్లీ పబ్లిసిటీ.. నో యాక్టివిటీ
పులివెందుల : చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు ఓన్లీ పబ్లిసిటీ, నో యాక్టివిటీ అన్న విధంగా మారారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం పులివెందుల భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంపు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వాటర్ గ్రిడ్ పనులను చంద్రబాబు నాయుడుతో ప్రారంభించాలని వీళ్లు కాన్సెప్ట్ పెట్టుకున్నారని, అసలు వాటర్ గ్రిడ్ పథకాన్ని వీళ్లే కనిపెట్టినట్లు, ఆ పథకం వీళ్లే మంజూరు చేసినట్లు, వీళ్ల బిల్డప్ తెలియని వాళ్లు చూస్తే ఆశ్చర్యపోతారన్నారు. రూ.480 కోట్లతో మంజూరు చేసిన తాగునీటి పథకానికి సంబంధించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే దాదాపు 60 నుంచి 80 శాతం పనులు పూర్తయినా వీళ్లు ఇంకా పూర్తి చేయడం లేదన్నారు. ఎవరి హయాంలో ఏమి జరిగిందో పులివెందుల ప్రజలందరికీ తెలుసన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా ప్రతి రైతుకు వచ్చేదన్నారు. ఈనెల 15వ తేదీన వరి కాకుండా అన్ని పంటలకు బీమా గడువు పూర్తయిందన్నారు. వరికి ఇంకా కొంచెం గడువు ఉందని, ఏ ఒక్క రైతుకు కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. దాని ఫలితంగా రైతులెవరూ బీమా, ప్రీమియం కట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు. జనవరి 15వ తేదీ వరకు బీమా గడువు పెంచాలని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్‌లు విదేశాలకు వెళతారు.. ఒక గ్రూపు మీటింగ్‌కు సంబంధించి ఫొటో తీస్తారు, ఆ ఫొటో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించి, మీడియా చానెళ్లలో ప్రసారం చేసి రాత్రింబవళ్లు చెమటోడుస్తున్నట్లు కలరింగ్ ఇస్తారన్నారు. ఇవన్నీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
నాయకత్వానికి నిలువెత్తు రూపం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
జగనన్న జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, జగనన్న ఇష్టపడే ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. నాయకత్వానికి నిలువెత్తు రూపం జగన్ అని అన్నారు. రాజకీయ అరంగ్రేటం నుంచి నేటి వరకు ఆయన జర్నీ చూస్తే ఆదర్శనీయమని తెలిపారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపిస్తారని, కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులతో, దీవెనలతో మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు.
కూటమి ప్రభుత్వంపై ఎంపీ
వైఎస్ అవినాష్‌రెడ్డి ఫైర్


