ఉత్సాహంగా జిల్లాస్థాయి ఖేలో ఇండియా పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఖేలో ఇండియా అస్మితా లీగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అండర్ 14, 16 బాలబాలికలకు ట్రియాథ్లాన్ హైజంప్, లాంగ్‌జంప్, 60 మీటర్ల, 600 మీటర్ల పరుగు పోటీలు, బ్యాక్‌త్రో, షాట్‌పుట్, జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో విభాగాలలో పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి 120 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యంతో అందరిని ఆకట్టుకున్నారు. ప్రతిభ కనపరచిన క్రీడాకారులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మార్తల సుధాకర్‌రెడ్డి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బసిరెడ్డి వీరకళ్యాణ్‌రెడ్డి మాట్లాడుతూ ఖేలో ఇండియా లీగ్‌మ్యాచ్ ప్రతిభ గల క్రీడాకారులకు మంచి అవకాశమన్నారు. అబ్జర్వర్ రాజా, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అహ్మర్‌బాషా, వ్యాయామ సంచాలకులు నాగూర్‌బాషా, రమణయ్య, షేక్‌బాషా, సుబ్బయ్య, లక్ష్మీ, రాఘవ, సతీష్‌రెడ్డి తదితరులు పర్యవేక్షించారు.


