సైన్సు మ్యూజియం సందర్శన | - | Sakshi
Sakshi News home page

సైన్సు మ్యూజియం సందర్శన

Dec 22 2025 2:21 AM | Updated on Dec 22 2025 2:21 AM

సైన్సు మ్యూజియం సందర్శన

సైన్సు మ్యూజియం సందర్శన

సైన్సు మ్యూజియం సందర్శన ముగిసిన స్కౌట్‌ మాస్టర్‌ శిక్షణ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడం దుర్మార్గం కాల్‌ సెంటర్‌ సేవలు వినియోగించుకోవాలి

కడప ఎడ్యుకేషన్‌: కడప చెన్నూరు బస్టాండ్‌లో ఉన్న సైన్సు మ్యూజియం సెంటర్‌ను ఆదివారం ఉన్నత విద్య ఆర్‌జేడీ డాక్టర్‌ రవీంద్రనాథ్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్‌, సైన్సు విభాగ అద్యాపకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు సైన్సు మ్యూజయంలోని పరికరాలను పరిశీలించారు. సైన్సు మ్యూజియంలోని ఎక్యూప్‌మెంట్‌ గురించి సైన్సు క్యూరేటర్‌ రెహమాన్‌ను అడిగి తెలుసుకున్నారు. కడప ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సలీంబాషా పాల్గొన్నారు.

కడప ఎడ్యుకేషన్‌: కడపలోని భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా ప్రధాన శిక్షణ కేంద్రంలో వారం రోజుల నుంచి సాగుతున్న స్కౌట్‌ మాస్టర్‌ శిక్షణ ఆదివారంతో ముగిసింది. ఎల్‌.ఓ.సి డాక్టర్‌ కమల కన్నన్‌, శివ ప్రసాద్‌ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బేసిక్‌, అడ్వాన్స్‌ కోర్సు శిక్షణకు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి దాదాపు ఎనబై మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ సెక్రటరీ వెంకట సుబ్బయ్య, కోశాధికారి శివ శంకర్‌ రెడ్డి, సహాయ సిబ్బంది శివ ప్రసాద్‌, అమర్నాథ్‌ బాబు, అహమ్మద్‌, పాల్గొన్నారు.

కడప ఎడ్యుకేషన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బహుజన టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేకల శివార్జున డిమాండ్‌ చేశారు. కడపలోని బహుజన టీచర్స్‌ యూని యన్‌ సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయుల కు అనేక హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత విస్మరించడం చంద్రబాబు ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పీఆర్సీ కమిటీ వేసి, 30శాతం ఐఆర్‌ ప్రకటించాలన్నారు. ఉద్యోగులకు రావలసిన పెండింగ్‌ డీఏలు, ఐ.ఆర్‌, పీఆర్సీ కమిటీలపై ఆలస్యం చేయకుండా మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయులలో నెలకొన్న తీవ్ర నిరాశ నిస్పహలను తగ్గించాలని కోరారు. కడప జిల్లా అధ్యక్షుడు యమ్‌. గంగరాజు, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు కట్టా గంగాధర్‌, జిల్లా కార్యదర్శి కె. జయరాం తదితరులు పాల్గొన్నారు.

సిద్దవటం: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడం దుర్మార్గమైన చర్య అని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సిద్దవటం మండలం భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న దివంగత నేత వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద ఆదివారం ఎమ్మెల్యే కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం పరమాత్మ సేవా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్య ఉచితంగా అందాలని, అలాగే పేద కుటుంబాల వారు ఉచిత వైద్యం పొందాలన్న ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి 17 మెడికల్‌ కళాశాలలు తెచ్చారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటిని ప్రైవేట్‌పరం చేసేందుకు చర్యలు చేపట్టారన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్‌కు కాల్‌ చేయవచ్చన్నారు.

సభాభవన్‌లో పీజీఆర్‌ఎస్‌ నిర్వహణ

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)ను సోమవారం సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562–244437 ల్యాండ్‌ లైన్‌ నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement