కడప – బెంగళూరు రైల్వే పనులను పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

కడప – బెంగళూరు రైల్వే పనులను పూర్తి చేయాలి

Mar 23 2025 12:22 AM | Updated on Mar 23 2025 12:22 AM

కడప – బెంగళూరు రైల్వే పనులను పూర్తి చేయాలి

కడప – బెంగళూరు రైల్వే పనులను పూర్తి చేయాలి

కడప ఎడ్యుకేషన్‌ : కడప బెంగుళూరు రైల్వే పనులను 20 సంవత్సరాల క్రితం మెదలు పెట్టినప్పటికీ అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ పనులను పూర్తి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు సిఆర్వి ప్రసాద్‌ అన్నారు. శనివారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక కమిటీ ఆధ్వర్యంలో పబ్బపురం వద్ద కడప బెంగళూరు రైల్వే ట్రాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప– బెంగళూరు రైల్వే పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే లైన్‌ పూర్తి చేయడంలో పూర్తిగా అలసత్వం వహిస్తున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి సాకుగా చూపించి రాష్ట్ర బడ్జెట్‌ అంత అమరావతి కేటాయించాలని చేడటం దారుణం అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి గాని కేంద్రీకరణ చేయాలనుకోవడం సిగ్గు చేటని వారు దుయ్యబట్టారు. కడప బెంగళూరు రైల్వే లైను పూర్తయితే కడప జిల్లాలో ఎక్కువ మంది రైతులు పండించుకునే ధాన్యాలను కూరగాయలను బెంగళూరు వంటి ప్రాంతాలకు సులువుగా మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. అసెంబ్లీలో కానీ, పార్లమెంటులో కడప బెంగళూరు రైల్వే పనులను పూర్తిచేయాలని ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రస్తావన చేయకపోవడం దారుణం అన్నారు. రాయలసీమ ప్రాంతం నుండి ఎన్నికై న ప్రజాప్రతినిధులు రైల్వే పనులను పూర్తిచేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ చేశారు. కార్యక్రమంలో నాయకులు గుర్రప్ప,అంజి, సుబ్బరాయుడు, జయవర్ధన్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement