
విషద్రావణం తాగి విద్యార్థిని ఆత్మహత్య
జమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని నాగులకట్ట వీధిలోని ఎస్సీ హస్టల్‌లో ఉంటున్న అక్షయ(19) శుక్రవారం విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామానికి చెందిన అక్షయ పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఎస్సీ హాస్టల్‌లో ఉంటోంది. గురువారం రాత్రి వసతి గృహంలో వి ద్యార్థినుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడం, కాసేపటి తరువాత విద్యార్థి నులు క్షమాపణలు చెప్పుకోవడం జరిగినట్లు తెలిసింది. అయితే శుక్రవారం మ ధ్యాహ్నం అందరూ భోజనం చేయడానికి వెళ్లగా అక్షయ మాత్రం వెళ్లలేదు. అప్ప టికే తెచ్చుకున్న విష ద్రావణాన్ని(వాస్మోల్) తాగింది. విషయం తెలుసుకున్న వార్డెన్ బత్తుల ప్రభావతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూ చన మేరకు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 8.45 గంటల మధ్యలో చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
ప్రజా సంఘాల ఆగ్రహం
అక్షయ అత్మహత్యపై ప్రజాసంఘాల నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు వసతిగృహనికి చేరుకోని విద్యార్థిని మృతికి హస్టల్ వార్డన్ బత్తుల ప్రభావతి, సిబ్బంది కారణం అని హస్టల్స్ ఏఎస్‌డబ్ల్యూ గురుప్రసాద్, సీఐ లింగప్పకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది నవంబరు 7న కూడా వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు వాస్మాల్ తాగి అత్మహత్య యత్నానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఇంత జరుగతున్నా అధికారులు చర్యలు చేపట్టలేదన్నారు. సీఐ ఎస్.లింగప్ప వసతి గృహానికి వెళ్లి విద్యార్థినులను విచారించారు. దర్యాప్తు అనంతరం అక్షయ ఆత్మహత్యయత్నానికి కారణాలు తెలియజేస్తామని సీఐ తెలిపారు.
స్థలం వివాదంలో ఏడుగురికి జైలు
విశాఖ లీగల్: ఆస్తి విషయంలో ఒక వ్యక్తిని మోసం చేసిన ఏడుగురికి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.18.60 లక్షల జరిమానా విధిస్తూ నగరంలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం కమ్ 11వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.సత్యదేవి తీర్పు వెలువరించారు. పెందుర్తి పోలీస్ అధికారులు తెలిపిన వివరాలివీవీ.. వైఎస్సార్ జిల్లా బిట్రగుంట గ్రామానికి చెందిన పి.అప్పలరాజు 2014లో స్థలం కొనుగోలు చేయాలని భావించి పలువురిని సంప్రదించారు. దీనిని అవకాశంగా తీసుకున్న పిల్ల అర్జున్ మరో తొమ్మిది మందితో కలిసి మోసపూరితంగా కుట్ర పన్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 158.88 చదరపు గజాల స్థలం కొనుగోలుకు అప్పలరాజు నుంచి రూ.18 లక్షలు వసూలు చేశారు. అయితే అదే స్థలాన్ని వేరే వారికి కూడా విక్రయించినట్లు 2017 ఫిబ్రవరిలో అప్పలరాజు గుర్తించి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులు పిల్ల అర్జున్, కె.అంజలిరావు, ఎం.పెద్ద అప్పలరాజు, ఎం.మరిడయ్య, ఎం.రమణ, ఎం.గోవింద్, ఎం.రాంబాబు, ఎం.చిన్న మరిడయ్య, ఎం.సూరిబాబు, ఎం.అప్పలరాజులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతుండగా పిల్ల అర్జున్, ఎం.పెద్ద అప్పలరాజు, ఎం.అప్పలరాజు మృతి చెందారు. మిగిలిన ఏడుగురు నిందితులకు న్యాయమూర్తి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.18.60 లక్షల జరిమానా విధించారు. జరిమానా మొత్తాన్ని బాధితుడు అప్పలరాజుకు చెల్లించాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.
గిరిజన మహిళపై దాడి
మదనపల్లె : భూ వివాదంలో కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని గిరిజన మహిళ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళితే న్యాయం చేయకపోగా, తనపైనే కేసు బనాయించారని ఆరోపించారు. ఆమె వివరాల మేరకు.. పట్టణంలోని చంద్రా కాలనీకి చెందిన కృష్ణా నాయక్, సునీత దంపతులు దినసరి కూలీలు. వారికి స్థానికుడు బాల్ రెడ్డితో స్థల వివాదం ఉంది. అదే స్థలంలో తాము నిర్మించుకున్న పునాదులను గురువారం సాయంత్రం కొందరు తొలగిస్తున్నారని చెప్పడంతో అక్కడకు వెళ్లినట్లు సునీత తెలిపారు. ఆ సమయంలో బాల్‌రెడ్డి, కుటుంబ సభ్యులు తనపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారన్నారు. అపస్మారకస్థితిలో పడిన తనను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి తన చెల్లెలు చికిత్స అందించిందన్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్‌పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా, బాల్‌రెడ్డి ఫిర్యాదుమేరకు తనపై కేసు నమోదుచేశారన్నారు.

విషద్రావణం తాగి విద్యార్థిని ఆత్మహత్య

విషద్రావణం తాగి విద్యార్థిని ఆత్మహత్య